ETV Bharat / jagte-raho

ప్రమాదవశాత్తు మెడకు టవల్​ చుట్టుకుని వ్యక్తి మృతి

author img

By

Published : Nov 26, 2020, 3:26 PM IST

చిన్నపాటి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. టవలే కదా అని తేలిగ్గా తీసుకుంటే అదే అతని పాలిట మృత్యపాశమైంది. వరికోత యంత్రం ఇంజిన్​ ఆపకుండానే అడుగుభాగాన ఉన్న ధాన్యాన్ని తీసేందుకు ఓ వ్యక్తి డబ్బాలో తలపెట్టాడు. అతని తలకు ఉన్న తువాలు మెడకు చుట్టుకుని మృతిచెందాడు.

One person died accidenttally in crop cutting machine in nalgonda dist
ప్రమాదవశాత్తు మెడకు టవల్​ చుట్టుకుని వ్యక్తి మృతి

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం బొమ్మకల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వరికోత యంత్రంలో ధాన్యాన్ని బయటికి తీయబోయి ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన బొమ్మకంటి ఆంజనేయులు(30) వరికోత యంత్రం డ్రైవర్​గా పనిచేస్తున్నాడు.

కోత ముగిసిన తర్వాత రోజులాగే యంత్రం ఇంజన్​ ఆపకుండానే అడుగుభాగంలో ధాన్యాన్ని తీసేందుకు డబ్బాలోకి తలపెట్టాడు. అతని తలకు ఉన్న టవల్ మెడకు చుట్టుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇది గమనించిన మరో రైతు కొడవలితో తువాలును కోసి అతన్ని నల్గొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి:ఉత్సవాలు చేయడం కాదు.. గౌరవం కాపాడాలి : బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.