ETV Bharat / jagte-raho

కారులో గంజాయి తరలింపు.. ఇద్దరు అరెస్ట్​

author img

By

Published : Oct 22, 2020, 7:43 PM IST

కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను భద్రాచలం పోలీసులు అరెస్ట్​ చేశారు. రూ. 6 లక్షల విలువ చేసే 43 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం నుంచి హైదరాబాద్​, నల్గొండ, వరంగల్​తో పాటు ఇతర రాష్ట్రాలకి గంజాయి రవాణా జరుగుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

Marijuana illegal transporters were arrested by bhadrachalam police
కారులో గంజాయి తరలింపు.. ఇద్దరు అరెస్ట్​

తెలంగాణ- ఛత్తీస్​గఢ్​ సరిహద్దు అటవీ ప్రాంతం భద్రాచలం కేంద్రంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. స్థానికంగా నిర్వహించిన తనిఖీలో ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం మీదుగా నల్గొండకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 6 లక్షల విలువ చేసే 43 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

భద్రాచలం నుంచి హైదరాబాద్​, నల్గొండ, వరంగల్​తో పాటు ఇతర రాష్ట్రాలకి గంజాయి రవాణా జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కారును, గంజాయిని సీజ్ చేసి నిందితులను రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి: పెళ్లి మాటున మోసం.. అదేమని అడిగితే హత్యాయత్నం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.