ETV Bharat / jagte-raho

అశ్వారావుపేటలో మావోయిస్ట్ గెరిల్లా దళసభ్యుడు అరెస్ట్

author img

By

Published : Nov 22, 2020, 10:42 PM IST

మావోయిస్టు గెరిల్లా దళసభ్యుడు వెంకన్నబాబును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉట్లపల్లి సమీపంలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా అతన్ని పట్టుకున్నారు.

Maoist geriilla squad candidate arrested by ashwaraopeta police in bhadradri kothagudem dist
అశ్వారావుపేటలో మావోయిస్ట్ గెరిల్లా దళసభ్యుడు అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీసులు మావోయిస్టు గెరిల్లా దళసభ్యుడు గడ్డం వెంకన్నబాబును అరెస్ట్ చేశారు. ఉట్లపల్లి సమీపంలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా అతన్ని పట్టుకున్నారు. మండలంలోని నల్లపాడుకు చెందిన అతను 2018లో భద్రాచలంలో ఐటీఐ చదువుతూ చర్ల మండలానికి చెందిన కొందరు వక్తుల ద్వారా మావోలకు దగ్గరయ్యాడు.

అతి తక్కువ కాలంలోనే గెరిల్లా దళసభ్యుడిగా నియమితుయ్యాడు. అగ్రనేతల ఆ దేశాలతోనే అశ్వారావుపేట యువకులను మావోయిస్టు పార్టీవైపు ఆకర్షించేందుకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతని వద్ద నుంచి విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఉపేంద్రరావు తెలిపారు.

ఇదీ చూడండి:హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెండు వేర్వేరు ప్రమాదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.