ETV Bharat / jagte-raho

ఆ వెంచర్లోకి ఇసుక ఎలా వచ్చింది.. ఎవరు నిల్వ చేశారు?

author img

By

Published : Nov 6, 2020, 1:41 PM IST

తన వెంచర్లో గుర్తుతెలియని వ్యక్తులు ఇసుక అక్రమ నిల్వచేసినట్టు ఆ వెంచర్​ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఐదు లారీల ఇసుకను సీజ్​చేసి.. దానిపై విచారణ జరుపుతున్నారు.

illegal storage of sand in a venchor at motkur in yadadri bhuvanagiri district
ఆ వెంచర్లోకి ఇసుక ఎలా వచ్చింది.. ఎవరు నిల్వ చేశారు?

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ ఎదురుగా ఉన్న శ్రీలక్ష్మీ వెంచర్​లో గుర్తు తెలియని వ్యక్తలు సుమారు ఐదు లారీల ఇసుకను అక్రమంగా నిల్వచేశారు. దానిని గమనించిన వెంచర్ యజమాని పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఈవిషయంపై వెంచర్ యజమాని తమకు ఫిర్యాదు చేశారని ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. వెంచర్​లో ఇసుక ఎవరు పోశారనే విషయంలో ఆధారాలు లేకపోవడం వల్ల తాము తహసీల్దారుకు నివేదించామన్నారు. మైనింగ్ అధికారుల సూచన మేరకు ఇసుకను సీజ్ చేశామని ఎస్సై వివరించారు.

ఇదీ చూడండి: యథేచ్ఛగా ఇసుక దందా... చూసీచూడనట్లు అధికారుల పంథా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.