ETV Bharat / jagte-raho

తాత అంత్యక్రియలు.. అంతలోనే మనవళ్ల మృత్యువాత

author img

By

Published : Nov 21, 2020, 7:53 AM IST

తాత చితి ఆరనే లేదు.. అంతలోనే నలుగురు మనవళ్ల మృత్యువాత ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆ తల్లికి కడుపు కోతని మిగిల్చింది. అంత్యక్రియల అనంతరం స్నానానికి చెరువులోకి దిగి నలుగురు పిల్లలు అనూహ్యంగా కన్ను మూశారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా నంద్యా నాయక్​ తండాలో శుక్రవారం జరిగింది.

four boys died
తాత అంత్యక్రియలు.. అంతలోనే మనవళ్ల మృత్యువాత

నారాయణపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో స్నానం చేయటానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన దామరగిద్ద మండలం మొల్లమాడక గ్రామ పంచాయతీ పరిధిలో నంద్యా నాయక్‌ తండాలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.

తండాకు చెందిన ఓ వృద్ధుడు గురువారం మృతి చెందాడు. అతని అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. దీంతో ఆ కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు స్నానం చేయటానికి చెరువులో దిగారు. ప్రమాదవశాత్తు నలుగురు చిన్నారులు ఒకరి తర్వాత మరొకరు మునిగిపోయారు. వీరితో పాటు వెళ్లిన ఓ బాలుడు విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశాడు. స్థానికులు గాలింపు చేపట్టగా అప్పటికే చిన్నారులు మృతి చెందారు. మృతులను అర్జున్‌ (12), అరుణ్‌(8), గణేశ్(8), ప్రవీణ్‌ (8)గా గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై గోవర్ధన్‌ ఘటనా స్థలికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు.

ఇదీ చదవండి: నగరంలో మరోసారి పట్టుబడ్డ హవాలా డబ్బు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.