ETV Bharat / jagte-raho

ఉరేసుకుని బిహార్​కు చెందిన వ్యక్తి బలవన్మరణం

author img

By

Published : Sep 21, 2020, 12:42 PM IST

బిహాార్ రాష్ట్రం నుంచి వచ్చి కొద్దిరోజులే అయ్యింది. ఓ పరిశ్రమలో కాపాలాదారునిగా కూడా పనికి కుదిరాడు. అంతాబాగుంది అనుకునేలోపే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గండెగూడ గ్రామంలో జరిగింది.

a-security-guard-commits-suicide-in-an-industry-in-sangareddy-district
ఓ పరిశ్రమలో ఉరేసుకుని బీహార్​కు వ్యక్తి బలవన్మరణం

బిహార్ రాష్ట్రానికి చెందిన అమిత్ మిశ్రా అనే యువకుడు బ్రతుకు తెరువు కోసం వచ్చాడు. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలం గండెగూడ గ్రామంలో ఉన్న అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ బొల్లారం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అమిత్​ బిహార్ నుంచి వచ్చి 45 రోజులే అయ్యింది.

అయితే ఆదివారం ఉదయం పరిశ్రమలోని షెడ్​పై ఉన్న ఇనుప కమ్మికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అమీన్​పూర్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతనికి ప్రేమ వ్యవహారం ఉందని స్నేహితులు చెబుతున్నారు. ప్రేమ విఫలమైందా లేక ఇతర కారణాలు ఏమైనా అతని మరణానికి దారితీశాయనా..? అని పోలీసులు విచారిస్తున్నారు.

ఇదీ చూడండి: విహారానికి వెళ్లి జలప్రవాహానికి కొట్టుకుపోయాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.