ETV Bharat / international

ఆ కానుకలను ఇచ్చేయండి.. ప్రధానిని కోరిన పీఎంఓ!

author img

By

Published : Aug 31, 2021, 7:45 AM IST

ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) దగ్గర ఉన్న కానుకలను ప్రభుత్వానికి ఇచ్చేయాలని ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం కోరింది. వివిధ దేశాల పర్యటనల్లో ఇచ్చిన దాదాపు 42 కానుకలు నెతన్యాహు(Netanyahu news) కుటుంబం వద్దే ఉన్నాయని తెలిపింది.

Netanyahu
నెతన్యాహు

ఇజ్రాయెల్​ను దాదాపు 15 ఏళ్లపాటు పరిపాలించిన బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu).. వివిధ దేశాల్లో పర్యటించినప్పుడు భారీగానే కానుకలు పొందారు. అయితే ఆ గిఫ్టులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) కోరింది. ఇదే విషయాన్ని ఆ దేశ ప్రస్తుత ప్రధాని నాఫ్తాలి బెన్నెట్ సోమవారం ధ్రువీకరించారు.

42 కానుకలేవి?

సాధారణంగా దేశాధినేతలు.. ఇతర దేశాల పర్యటనలకు వెళ్లినప్పుడు కానుకలను ఇచ్చిపుచ్చుకుంటారు. అలా దాదాపు 42 కానుకలు నెతన్యాహు దగ్గర ఉన్నాయి. ఆ కానుకల్లో అమెరికా మాజీ ప్రధాని బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు పుతిన్​లు ఇచ్చినవీ ఉన్నాయి. గిఫ్టు విలువ 300 షెకెల్స్​ లేదా 90 డాలర్లు దాటితే.. అవి ఇజ్రాయెల్ ఆస్తిగా పరిగణిస్తారు. వాటిని ప్రభుత్వానికి ఇవ్వాలని ఇజ్రాయెల్ పీఎంఓ నెతన్యాహు కుటుంబాన్ని (Netanyahu news) కోరింది.

నెతన్యాహు(Benjamin Netanyahu) వద్ద ఉన్న కానుకల్లో బంగారం పూతతో ఉన్న చతురస్రాకర బాక్స్​, పుతిన్​ ఇచ్చిన మొదటి బైబిల్ పుస్తకం. ఇంకా ఫ్రెంచ్, జర్మనీ దేశాధినేతలు, పోప్​ల నుంచి తీసుకున్న కానుకలూ ఉన్నాయి.

అయితే.. చట్టపరంగా ఇవ్వాల్సిన గిఫ్టులన్నీ ప్రభుత్వానికి ఇచ్చేశామని నెతన్యాహు కుటుంబం తెలిపింది. వ్యాపారవేత్తల నుంచీ ఖరీదైన కానుకలను స్వీకరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ఆయనపై నమోదైన కేసు విచారణలో ఉంది.

ఇదీ చదవండి: స్టూడెంట్ మాస్క్ పెట్టుకోలేదని.. క్లాస్ మధ్యలోనే ప్రొఫెసర్ రిటైర్మెంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.