ETV Bharat / international

'నాలుగో డోసు పొందినా.. ఒమిక్రాన్‌ నుంచి రక్షణ పాక్షికమే'

author img

By

Published : Jan 19, 2022, 7:15 AM IST

4th vaccine dose covid: టీకా డోసుల సంఖ్య పెరిగిన కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ నుంచి రక్షణ అంతంత మాత్రంగానే ఉందని ఇజ్రాయెల్​ శాస్త్రవేత్తలు తెలిపారు. కొంతమందికి నాలుగో టీకా ఇచ్చి పరీక్షించారు. అయితే వారిలో యాంటీ బాడీల సంఖ్య తక్కువగా పెరిగినట్లు గుర్తించారు. దీంతో ఒమిక్రాన్​ను ఎదుర్కొనే శక్తి నాలుగో డోసు తరువాత కూడా అంతంత మాత్రమే అని అంటున్నారు.

VACCINE
నాలుగో డోసు

4th vaccine dose covid: కొవిడ్‌-19 టీకా నాలుగో డోసు పొందడం వల్ల యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నప్పటికీ కరోనాలోని ఒమిక్రాన్‌ వేరియంట్‌ నుంచి పాక్షిక రక్షణ మాత్రమే లభిస్తోందని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. షెబా మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. టీకాల సురక్షితను, సమర్థతను వీరు పరిశీలించారు.

పరిశోధనలో భాగంగా షెబా మెడికల్‌ సెంటర్‌ సిబ్బందికి రెండో బూస్టర్‌ టీకా (నాలుగో డోసు) ఇచ్చారు. వీరిలో 154 మందికి ఫైజర్‌, 120 మందికి మోడెర్నా టీకాలు ఇచ్చారు. ఈ రెండు బృందాల్లోనూ నాలుగో డోసు ఇచ్చిన వారం తర్వాత యాంటీబాడీలు పెరిగాయి. రెండు వారాల తర్వాత పరిశీలించినప్పుడు ఫైజర్‌ టీకా పొందిన వారిలో యాంటీబాడీల సంఖ్య మరింత పెరిగింది. సురక్షిత అంశానికొస్తే.. ఫైజర్‌, మోడెర్నా టీకాలు రెండూ ఒకే స్థాయిలో ఉన్నట్లు తేలింది.

'మూడో డోసుతో పోలిస్తే నాలుగో డోసు తర్వాత యాంటీబాడీల స్థాయి స్వల్పంగా పెరిగింది. నాలుగో డోసు వల్ల ఇవి పెరిగినా ఒమిక్రాన్‌ వేరియంట్‌ నుంచి పాక్షికంగానే రక్షణ లభిస్తోంది. ఈ రకం వైరస్‌.. టీకా సామర్థ్యాలను ఒకింత ఏమారుస్తోంది' అని పరిశోధనలో పాలుపంచుకున్న గిల్లీ రెగెవ్‌ యోచాయ్‌ తెలిపారు.

ఇదీ చూడండి: పిల్లలకు టీకా.. ఆరోగ్య సిబ్బందికి భారత్‌ బయోటెక్‌ కీలక సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.