ETV Bharat / international

లంకలో దయనీయ పరిస్థితులు.. క్యూలైన్లలోనే కుప్పకూలుతున్న ప్రజలు!

author img

By

Published : Jul 23, 2022, 4:50 AM IST

lanka
lanka

శ్రీలంకలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంధనం కోసం గంటలు తరబడి పెట్రోల్​ బంకుల వద్ద లైన్లలో నిల్చుని ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు, దేశంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టే ప్రయత్నంలో భాగంగా దేశాధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే శ్రీలంక కొత్త ప్రధానిగా దినేశ్‌ గుణవర్థనను నియమించిన రోజే మరో ఇద్దరు క్యూలైన్లలో ఉండి కుప్పకూలారు.

Srilanka Crisis: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అత్యంత దయనీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నగదు కొరతకు తోడు భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం వంటి సమస్యలు అక్కడి ప్రజా జీవనాన్ని తీవ్ర అవస్థలకు గురిచేస్తున్నాయి. ఇంధనం కోసం పెట్రోల్‌ బంకుల వద్ద క్యూలైన్లలో ఎదురుచూసి చూసీ జనం ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు, దేశంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టే ప్రయత్నంలో భాగంగా దేశాధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే శ్రీలంక కొత్త ప్రధానిగా దినేశ్‌ గుణవర్థనను నియమించిన రోజే మరో ఇద్దరు క్యూలైన్లలో ఉండి కుప్పకూలారు.

శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌లో కిన్నియా పట్టణంలో ఫిల్లింగ్‌ స్టేషన్‌ వద్ద తన మోటార్‌ సైకిల్‌కు ఇంధనం నింపేందుకు 59 ఏళ్ల వ్యక్తి రెండు రాత్రులు పడిగాపులు కాశాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి మీడియా పేర్కొంది. దీంతో అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కిన్నియా బేస్‌ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపింది. అలాగే, మథుగమ ప్రాంతంలో పెట్రోల్‌ బంకు వద్ద క్యూ లైన్‌లో నిలబడి 70 ఏళ్ల వృద్ధుడు కుప్పకూలిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

srilanka-crisis-peopled-died-on-lines
.

దాదాపు 10రోజుల తర్వాత ఫిల్లింగ్ స్టేషన్‌కు ఇంధనం రాగా.. సరఫరా చేసేందుకు తగిన వ్యవస్థ లేకపోవడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. అయితే, ఇంధనం పొందడానికి జనం ఇలా క్యూలైన్లలో వేచి చూసి ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కాదు. 2022 ఆరంభం నుంచే ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయి. క్యూలైన్లలో నిలబడుతున్న క్రమంలో తీవ్రమైన వేడిని తట్టుకోలేక అలిసిపోయి కొందరు ప్రాణాలు విడిచారు.

శ్రీలంకలో ఇంధన పంపిణీని క్రబద్ధీకరించేందుకు వీలుగా గత వారం శ్రీలంక విద్యుత్‌, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర జాతీయ ఇంధన పాస్‌ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం అక్కడి పౌరులకు వారానికి ఇంత కొటా చొప్పున ఇంధనం పొందే అవకాశం ఉంటుందన్నారు. అయితే, ఇలాంటి చర్యలు తీసుకొచ్చినప్పటికి ఇంధన ఫిల్లింగ్‌ కేంద్రాలు నిండుకుండటంతో భారీగా జనం రద్దీ ఏర్పడి ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.

ఇవీ చదవండి: రాజపక్స మిత్రుడే లంక కొత్త ప్రధాని.. నిరసనకారుల క్యాంప్​లపై దాడులు

లంక కొత్త అధ్యక్షుడిగా విక్రమసింఘె ప్రమాణం.. గొటబాయకు టూరిస్ట్​ వీసా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.