ETV Bharat / international

క్రిస్మస్​ పార్టీలో కాల్పులు- 16 మంది మృతి

author img

By PTI

Published : Dec 18, 2023, 6:46 AM IST

Updated : Dec 18, 2023, 9:00 AM IST

Shooting In Mexico Today
Shooting In Mexico Today

Shooting In Mexico Today : మెక్సికోలో కాల్పులు కలకలం రేపాయి. గ్వానాజువాటో రాష్ట్రంలోని ఓ క్రిస్మస్​ పార్టీలో జరిగిన కాల్పుల్లో 12 మంది మృత్యువాతపడ్డారు. మరో ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Shooting In Mexico Today : మెక్సికోలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గ్వానాజువాటో రాష్ట్రంలోని సాల్వాటియెర్రా పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన క్రిస్మస్​ పార్టీలో ఓ సాయుధుడు బీభత్సం సృష్టించాడు. పార్టీల్లో పాల్గొన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 'పొసాడా' అనే పార్టీ అనంతరం హాల్​ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతోపాటు అదే రాష్ట్రంలోని సలామాంకా నగరంలో జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మరణించారని వెల్లడించారు. అయితే ఆ కాల్పులకు దారితీసిన పరిస్థితులను తెలపలేదు.

గ్వానాజువాటోలో జాలిస్కో ముఠా, సినాలోవా ముఠా మద్దతు ఉన్న స్థానిక గ్యాంగ్​ల మధ్య వైరం ఉంది. దీంతో ఈ రాష్ట్రంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. దేశంలో అత్యదిక హత్యలు జరిగిన రాష్ట్రం ఇదే.

ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం- ఐదుగురు పిల్లలు మృతి
Fire Accident In Arizona USA : అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. బుల్​సిటీ నగరంలో కొలరడో నది సమీపంలోని కాలనీలో ఉన్న రెండంతస్తుల డుప్లెక్స్​ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో పాటు 11, 13 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు మృతిచెందారు. అయితే ప్రమాద సమయంలో ఇంట్లో పెద్దవారెవరూ లేరని తెలుస్తోంది. బాధితుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలను అగ్మిమాపక విభాగం ప్రతినిధులు వెల్లడించలేదు. ఈ కేసును నగర పోలీసులు, అగ్నిమాపక విభాగంతో పాటు ఇతర ఏజెన్సీలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి.

చర్చిలో భారీ అగ్నిప్రమాదం
Fire Incident Church Los Angeles : అమెరికాలోని లాస్​ఎంజెలెస్​ ఏరియా చర్చి​లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ చర్చ్​లో తలపెట్టిన క్రిస్మస్​ ప్లే, బొమ్మల వితరణ కార్యక్రమానికి కొన్ని గంటల ముందు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. అయితే దాదాపు 20 నిమిషాల తర్వాత చర్చి​ పైకప్పు కూలిపోయింది. దీంతో మంటలను అదుపు చేయడం కొంచెం కష్టంగా మారిందని అగ్నిమాపక శాఖ ప్రతినిధి తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.

చర్చిలో కాల్పులు.. ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు..

ఆయిల్​ దొంగలించేందుకు కాల్పులు- ఐదుగురు సెక్యూరిటీ మృతి

Last Updated :Dec 18, 2023, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.