ETV Bharat / international

బార్​లో షూటింగ్​.. 9 మంది మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

author img

By

Published : Nov 11, 2022, 9:17 AM IST

Updated : Nov 11, 2022, 10:56 AM IST

Shooting In Mexico : మెక్సికోలో కాల్పులు కలకలం సృష్టించాయి. గ్వానాజువాటో రాష్ట్రంలోని ఓ బార్​లో జరిగిన కాల్పుల్లో 9 మంది మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

mexican cartel killings
మెక్సికోలో కాల్పులు

Shooting In Mexico: మెక్సికోలో దుండగులు మరో సారి కాల్పులకు తెగబడ్డారు. బుధవారం రాత్రి గ్వానాజువాటోలోని ఓ బార్​లో సాయుధులు చొరబడి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బార్​లోని వెయిటర్స్​తో సహా.. మొత్తంగా 9 మంది చనిపోయారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. గాయపడిన వారి పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు వెల్లడించారు.

బార్​లో రక్తంతో రాసిన కొన్ని పోస్టర్​లు కనిపించాయని అధికారులు తెలిపారు. ఈ దాడి శాంటా రోసా డి లిమా గ్యాంగ్ చేసినట్లుగా సంతకాలు చేశారని అధికారులు తెలిపారు. ఈ దాడులు స్థానికంగా ఉండే రెండు డ్రగ్స్​ ముఠాల మధ్య ఘర్షణ కారణంగా జరిగినట్లు తెలిపారు. బార్ యజమానులు శాంటా రోసా డి లిమా గ్యాంగ్​కు కాకుండా.. జాలిస్కో అనే మరో గ్యాంగ్​కు మద్దతు తెలిపుతున్నారనే కోపంతోనే దాడి చేసినట్లు వారి సందేశాలు ఆధారంగా తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

Last Updated :Nov 11, 2022, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.