ETV Bharat / international

క్యాసినో హోటల్​లో అగ్ని ప్రమాదం.. 19 మంది మృతి.. 60 మందికి గాయాలు

author img

By

Published : Dec 29, 2022, 10:03 AM IST

Updated : Dec 29, 2022, 7:56 PM IST

several-killed-in-cambodia-hotel-casino-fire
కంబోడియాలోని క్యాసినో హోటల్​లో ఘోర అగ్ని ప్రమాదం

థాయిలాండ్ సరిహద్దు కంబోడియాలోని ఓ హోటల్​లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 19మంది మృతి చెందగా.. 60మంది గాయపడ్డారు.

థాయిలాండ్‌ సరిహద్దు కంబోడియాలోని ఓ క్యాసినో హోటల్​లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గ్రాండ్ డైమండ్ సిటీలో ఉన్న క్యాసినో హోటల్​లో బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 మంది మృతిచెందారు. 60 మంది గాయాలపాలయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. హుటాహుటిన క్షతగాత్రులను థాయ్‌లాండ్‌లోని సాకేయో ప్రావిన్స్‌లోని ఆసుపత్రులకు తరలించారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. "తొలుత మంటలు హోటల్​ ఒకటో అంతస్తులో సంభవించాయి. తర్వాత ఈ మంటలు కార్పెట్​లకు అంటుకుని భవనం అంతటా వ్యాప్తిచెందాయి" అని స్థానికులు తెలిపారు.

Last Updated :Dec 29, 2022, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.