ETV Bharat / international

ఉక్రెయిన్​ కెమికల్​ ఫ్యాక్టరీపై రష్యా దాడి.. 800 మంది అక్కడే!

author img

By

Published : Jun 13, 2022, 7:13 AM IST

Ukraine Crisis: ఉక్రెయిన్‌లో పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్‌ను పూర్తిగా ఆక్రమించుకోవాలనే లక్ష్యానికి రష్యా దాదాపుగా చేరువైంది. అక్కడ కీలక నగరమైన సీవీరోదొనెట్స్క్‌లో ఓ రసాయన కర్మాగారంపై భీకర దాడులు జరిపాయి రష్యన్​ బలాగాలు. దీంతో పెద్ద ఎత్తున చమురు లీకై మంటలు ఎగసిపడ్డాయి. మరోవైపు, యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనేది ఎవరికీ తెలియదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ అన్నారు.

RUSSIA UKRAINE WAR
RUSSIA UKRAINE WAR

Ukraine Crisis: ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో పారిశ్రామిక నగరమైన సీవీరోదొనెట్స్క్‌పై రష్యా దాడులు తీవ్రతరమయ్యాయి. అక్కడ ఉన్న అజోట్‌ రసాయన కర్మాగారంపై రష్యా భారీగా ఫిరంగి గుళ్ల వర్షం కురిపించింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ కర్మాగారంలో వందల మంది ప్రజలు తలదాచుకున్నట్లు ఉక్రెయిన్‌ టీవీ పేర్కొంది. ఎంతమేరకు ప్రాణనష్టం చోటు చేసుకుందో తెలియరాలేదు. బాంబుల నుంచి రక్షణ కోసం కర్మాగారం ఆవరణలోని బంకర్లలో 800 మంది తలదాచుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు.

RUSSIA UKRAINE WAR
.

వీరిలో దాదాపు 400 మంది వరకు ఉక్రెయిన్‌ సైనికులేనని రష్యాలో 'లుహాన్స్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌' రాయబారి రోడియన్‌ మిరొష్ణిక్‌ చెప్పారు. ఇళ్లను రష్యా శతఘ్నులు పూర్తిగా నేలమట్టం చేస్తున్నాయని లుహాన్స్క్‌ గవర్నర్‌ సెర్హీ హైడై చెప్పారు. ఖేర్సన్‌, జపోరిజిజియాలలో తమ దళాలు కొన్ని పట్టణాలు, గ్రామాలను తిరిగి స్వాధీనం చేసుకొన్నాయని వెల్లడించారు. సీవీరోదొనెట్స్క్‌- లీసీచన్స్క్‌ మధ్య అనుసంధానికి ఉన్న రెండో వంతెననూ రష్యా బలగాలు ధ్వంసం చేశాయని చెప్పారు.

RUSSIA UKRAINE WAR
రసాయన కర్మాగారం ఆవరణ దృశ్యం
RUSSIA UKRAINE WAR
గాయపడినవారిని సపర్యలు చేస్తున్న మహిళ

ఎంతకాలం కొనసాగుతుందో: జెలెన్‌స్కీ
యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనేది ఎవరికీ తెలియదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ అన్నారు. తమ దేశ తూర్పు ప్రాంతాలను గుప్పిట పట్టేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకుంటున్నామని, పుతిన్‌ సేనల అంచనాలను వమ్ము చేస్తున్నామని వీడియో సందేశంలో చెప్పారు. డాన్‌బాస్‌ ప్రాంతం మొత్తాన్ని చేజిక్కించుకోవచ్చని రష్యా భావించినా గత 108 రోజుల్లో దానిని సాధించలేకపోయిందని, తమ సైనికుల్ని చూసి గర్విస్తున్నామని అన్నారు. తమకంటే మూడు రెట్లు ఎక్కువగా సైనికుల్ని రష్యా కోల్పోయి ఉంటుందని చెప్పారు. ఖేర్సన్‌ సహా తమ ఆక్రమిత ప్రాంతాల్లో అధికారుల్ని రష్యా నియమిస్తోంది. రష్యా వార్తా ప్రసారాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు తమ పాఠశాల విద్యనూ అక్కడ ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోంది.

RUSSIA UKRAINE WAR
రోదిస్తున్న ఉక్రెయిన్​ మహిళ

ఇవీ చదవండి: రష్యాలో మెక్​డొనాల్డ్స్ కొత్త పేరుతో రీఎంట్రీ.. ఎగబడిన జనం!​

యుద్ధం వస్తుందని చెబితే జెలెన్​స్కీ వింటే కదా?: బైడెన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.