ETV Bharat / international

లోయలోకి దూసుకెళ్లిన వ్యాను... 22 మంది మృతి

author img

By

Published : Jun 8, 2022, 1:41 PM IST

Updated : Jun 8, 2022, 3:26 PM IST

PAKISTAN ACCIDENT
PAKISTAN ACCIDENT

13:36 June 08

లోయలోకి దూసుకెళ్లిన వ్యాను... 22 మంది మృతి

ACCIDENT IN PAKISTAN: పాకిస్థాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతంలోని ఇరుకైన రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ వ్యాను.. 1,572 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ చిన్నారి తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు.

బలూచిస్థాన్ రాష్ట్రంలోని ఝోబ్ నేషనల్ హైవేపై ఈ ఘటన జరిగిందని పాకిస్థాన్ వార్తా సంస్థ 'డాన్' వెల్లడించింది. అక్తర్​జై ప్రాంతంలోని కిల్లా సైఫుల్లా వద్ద ఉన్న లోయలో వ్యాను పడిపోయిందని తెలిపింది. వాహనంలో 23 మంది వెళ్తున్నట్లు స్థానిక డిప్యూటీ కమిషనర్ హఫీజ్ మహమ్మద్ ఖాసిమ్ తెలిపారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 8, 2022, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.