ETV Bharat / international

టార్చ్ ​​లైట్ వేసి 1,100 కోళ్లను చంపిన వ్యక్తి.. 6 నెలల జైలు శిక్ష వేసిన కోర్టు

author img

By

Published : Apr 10, 2023, 8:25 AM IST

Updated : Apr 10, 2023, 11:37 AM IST

ఉద్దేశపూర్వకంగా పొరుగింటి కోళ్లను చంపినందుకు.. ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ఘటన చైనాలో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

man-murdered-1100-chickens-feud-with-neighbor-in-china-sentenced-to-6-months-jail
పొరుగింటి వాళ్ల మీద కోపంతో కోళ్లను చంపిన వ్యక్తి

టార్చ్​ లైట్‌ వేసి.. పొరుగింటి వారికి చెందిన కోళ్లను చంపినందుకు ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అదేంటి కోళ్లే కదా.. చంపితే జైలు శిక్ష విధించాలా? అని అనుకుంటున్నారా? ఆ వ్యక్తి చంపినవి ఒకటి రెండు కోళ్లు కాదండోయ్​. ఏకంగా 1,100 కోళ్లను చంపాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. నిందితుడికి ఈ మేరకు శిక్ష విధించింది.

ఇదీ జరిగింది..
జాంగ్‌ అనే వ్యక్తికి తన పొరుగింట్లో ఉంటున్న 'గూ'తో 2022 నుంచి వివాదం నడుస్తోంది. అనుమతి లేకుండానే తన చెట్లను నరికివేస్తున్నాడని.. గూపై జాంగ్​ ఆరోపణలు చేశాడు. దీంతో గూ.. జాంగ్‌ కోళ్ల ఫారమ్‌లోకి చొరబడి వాటి ముఖాలపై టార్చ్​ లైట్‌ ఆన్​ చేశాడు. దీంతో ఆ కోళ్లన్నీ భయంతో వణికిపోయి ఒక మూలకు చేరాయి. అనంతరం 460 కోళ్లు చనిపోయాయి.

ఒకే రోజు ఇన్ని కోళ్లు చనిపోయిన కారణంగా స్థానిక పోలీస్ స్టేషన్​లో.. జాంగ్‌ ఫిర్యాదు చేశాడు. దీంతో 'గూ'ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నష్టపరిహారం కింద జాంగ్‌కు 3000 యువాన్లు (దాదాపు రూ.35,700) చెల్లించాల్సిందిగా వారిద్దరి మధ్య రాజీ కుదిర్చారు. దీంతో జాంగ్‌పై మరింత ఆగ్రహం పెంచుకున్నాడు పొరుగింటి గూ.. ఎలాగైన జాంగ్​పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.

మరోసారి కోళ్ల ఫారమ్‌లోకి చొరబడ్డాడు. ఈ సారి మరో 640 కోళ్లను భయపెట్టి చంపాడు. దీంతో అతడ్ని అరెస్టు చేసిన పోలీసులు.. సెంట్రల్‌ చైనాలోని హునాన్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఉద్దేశపూర్వకంగానే నిందితుడు ఈ ఘటనకు పాల్పడట్లు గుర్తించారు. ఇతరులకు ఆస్తికి నష్టం కలిగించే విధంగా గూ ప్రవర్తించినట్లు తేల్చారు. ఆరు నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ కోడి వయసు ఎంతో తెలుసా?
సాధారణంగా కోళ్ల జీవితకాలం 5-10 ఏళ్లు ఉంటుంది. కానీ అమెరికాలోని ఓ కోడి పెట్ట మాత్రం 20 ఏళ్లు బతికి ప్రపంచంలోనే అత్యధిక రోజులు జీవించిన కోడిపెట్టగా గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించింది. నంకిన్ మిక్స్ అనే జాతికి చెందిన ఈ కోడి పేరు పీనట్​. దీన్ని మిషిగన్​కు చెందిన మార్సీ డార్విన్​ అనే లైబ్రేరియన్​ పెంచింది. ఈ ముసలి కోడిపెట్ట 2002లో పుట్టింది. పీనట్​ పుట్టి మార్చి 1 నాటికి 20 సంవత్సరాల 304 రోజులు అయ్యింది. ఈ కోడిన మార్సీ చాలా ప్రేమగా చూసుకుంటుంది. మార్సీ ఓళ్లో కూర్చొని పీనట్..​ టీవీ చూస్తుంది. ఆమె భూజాలపైకి ఎక్కుతుంది. మార్సీ.. పీనట్​ ఆరోగ్య విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. డీ విటమిన్​ టాబ్లెట్లు మెత్తగా దంచి తినిపిస్తుంది. అప్పుడప్పుడు తాజా పండ్లు, కూరగాయలు పెడుతుంది. ఎవరైనా ఎక్కువ రోజులు బతికే కోళ్లను పెంచితే.. వాటి డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోంది మార్సీ. ఈ కోడి తన జీవిత కాలంలో పలు ప్రేమాయణాలు కూడా సాగిచింది. ఈ ముసలి కోడి గురించి మరిన్ని వివరాలు, పోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated :Apr 10, 2023, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.