ETV Bharat / international

మసీదులో భారీ పేలుడు, 20 మంది దుర్మరణం

author img

By

Published : Aug 18, 2022, 6:49 AM IST

Updated : Aug 24, 2022, 10:43 AM IST

Kabul Blast సాయంత్రం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మసీదులో భారీ పేలుడు సంభవించింది. కాబుల్​లో బుధవారం జరిగిన ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

At least 20 dead, 40 injured in mosque explosion in Kabul
At least 20 dead, 40 injured in mosque explosion in Kabul

Kabul Blast: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో బుధవారం సాయంత్రం తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. స్థానిక ఖైర్‌ ఖానా ప్రాంతంలోని ఓ మసీదులో సాయంత్రం ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మసీదు ఇమామ్‌ సహా కనీసం 20 మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని కొందరు అధికారులు తెలిపారు.
కాబుల్​ ఉత్తరప్రాంతంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని, పేలుడు తీవ్రతకు సమీపంలోని భవనాల కిటికీలు ధ్వంసమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తాజా దారుణానికి పాల్పడింది ఎవరనేది ప్రస్తుతానికి తెలియరాలేదు. ఘటన జరిగిన వెంటనే దర్యాప్తు బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

ఇవీ చూడండి: భారత్, చైనా సంయుక్త సైనిక విన్యాసాలు, ఎప్పుడంటే

ఆ దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే 500 కోట్ల మంది ప్రాణాలు గాల్లోకి

Last Updated : Aug 24, 2022, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.