ETV Bharat / international

Congo Boat Accident : ఇంధనంతో వెళ్తున్న పడవలో మంటలు.. 16 మంది మృతి.. అనేక మంది గల్లంతు

author img

By PTI

Published : Oct 24, 2023, 7:03 AM IST

Updated : Oct 24, 2023, 7:51 AM IST

Congo Boat Accident
కాంగో బోటు ప్రమాదం

Congo Boat Accident : కాంగోలో జరిగిన పడవ ప్రమాదంలో 16 మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. ఇంధనంతో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

Congo Boat Accident : ఇంధనంతో వెళుతున్న ఓ పడవ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. కాంగోలోని ఓ నదిలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో 11 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఇంకా చాలా మంది ఆచూకీ లభించలేదని వెల్లడించారు. సోమవారం ఈ ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన పడవ ఇందనాన్ని లోడ్​ చేసుకుని.. ఎమ్​బండకా నుంచి రాజధాని కిన్షాసా వరకు వెళ్తోందని అన్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే సహయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

కాంగోలో రోడ్డు రవాణా వ్యవస్థ అంతగా బాగుండదు. పడవ ప్రయాణంతో పోలిస్తే దాని ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో పడవ ప్రయాణానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు కాంగో ప్రజలు. కాగా ఆదివారమే ఉత్తర కివు ప్రావిన్స్‌లోని రుత్షురు ప్రాంతంలో ఇళ్లు తగలబడి దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. M23 తిరుగుబాటుదారులే ఈ ఘటనకు కారణమని స్థానిక అధికారులు తెలిపారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు మృతి..
US Road Accident Today : అమెరికాలో పొగమంచు బీభత్సం సృష్టిస్తోంది. ఈ పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సోమవారం జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది గాయపడ్డారు. దీనిపై సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైనట్లు లూసియాన్​ స్టేట్​ పోలీసులు తెలిపారు. ఘటనలో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అనంతరం వాహనాలను తొలగించే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. అయితే బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.

"చాలా వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొన్ని వాహనాలు ఒకదాని కింద ఒకటి చిక్కుకున్నాయి. మరికొన్నింటికి మంటలు అంటుకున్నాయి." అని ఓ బాధితుడు తెలిపాడు. గాయపడిన చాలా మందికి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడిందని.. దీంతో రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు రావాలని పౌరులు పిలుపునిచ్చారు లూసియానా గవర్నర్​ జాన్ బెల్ ఎడ్వర్డ్స్. బాధితుల కోసం ప్రార్థనలు చేయాలని కోరారు. మృతుల కుటుంబీకులకు, క్షతగాత్రులకు అండగా ఉంటామని తెలిపారు.

Bangladesh Train Accident Today : ప్యాసింజర్ ట్రైన్, గూడ్స్​ రైలు ఢీ..​ 20 మంది మృతి

Imran Khan Cipher Case : రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో ఇమ్రాన్​పై అభియోగాలు.. నేరం రుజువైతే ఉరిశిక్ష!

Last Updated :Oct 24, 2023, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.