ETV Bharat / international

China Construction In Aksai Chin : కయ్యాలమారి కవ్వింపు.. అక్సాయ్​ చిన్​లో చైనా భారీ నిర్మాణాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 6:45 AM IST

Updated : Aug 31, 2023, 7:21 AM IST

China Construction In Aksai Chin India : కయ్యాలమారి చైనా కవ్వింపు చర్యలు కొనసాగిస్తోంది. తమ ప్రాంతమంటూ పేర్కొన్న అక్సాయ్​ చిన్​ సరిహద్దు వద్ద భారీ నిర్మాణాలు చేపట్టింది. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు బయటికి వచ్చాయి.

China Construction In Aksai Chin India
China Construction In Aksai Chin India

China Construction In Aksai Chin India : సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌ సహా అక్సాయ్‌ చిన్‌ ప్రాంతం తమవేనంటూ ఇటీవల మ్యాప్‌ను విడుదల చేసిన చైనా.. వాస్తవాధీన రేఖకు ( Line Of Actual Control ) తూర్పు ప్రాంతం అక్సాయ్‌ చిన్‌లో సొరంగాలు తవ్వుతోంది. ఉత్తర లద్దాఖ్‌లోని దెప్సాంగ్‌కు తూర్పున ఆరు కిలోమీటర్ల దూరంలో సొరంగాలు, బంకర్లు, రహదారులను నిర్మిస్తున్నట్టు వెల్లడైంది. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు బయటికి వచ్చాయి.

  • #China constructing #tunnels & shafts in #AksaiChin is a cause of concern to #India as these will be used to stockpile ammunition and missiles.

    We need to take a serious view of critical infrastructure buildups including tweaking with #Maps while dealing with the dragon.
    🇮🇳 pic.twitter.com/sZvffpvqUf

    — Brigadier Hardeep Singh Sohi,Shaurya Chakra (@Hardisohi) August 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అక్సాయ్‌ చిన్‌ ప్రాంతంలోని కొండల్లో కనీసం 11 చోట్ల పెద్ద కన్నాలు తవ్వుతున్నట్లు అంతర్జాతీయ నిపుణులు తేల్చారు. ఈ ప్రాంతంలో కొన్ని నెలలుగా పెద్దఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఆ చిత్రాల ద్వారా గుర్తించారు. వైమానిక, క్షిపణి దాడులు జరిగినా తమ సైన్యానికి ఎటువంటి నష్టం కలగని విధంగా పటిష్ఠమైన కాంక్రీటు నిర్మాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ భారత్‌ వైమానిక దాడులకు దిగితే దీటుగా ఎదుర్కొనేందుకే చైనా అక్కడ ఈ వ్యూహాలు రచిస్తున్నట్టు చెబుతున్నారు.ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉండటం భారత్‌కు కొంత ఆందోళన కలిగించే అంశమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

China Names Indian Territories : అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయ్​ చిన్ ప్రాంతాలను తమ దేశంలో భాగంగా చూపుతూ సోమవారం 'స్టాండర్డ్​ మ్యాప్​' (China Standard Map 2023)పేరిట చైనా ఓ మ్యాప్ విడుదల చేసింది. అందులో అరుణాచల్​ ప్రదేశ్​ను దక్షిణ టిబెట్‌గా డ్రాగన్‌ పేర్కొంది. అయితే, చైనా ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడటం ఇదేం మొదటి సారి కాదు. ఇంతకుముందు ఏప్రిల్​లో అరుణాచల్​ ప్రదేశ్​లోని కొన్ని నదులు, పర్వతాలు, ప్రాంతాలకు చైనా తమ పేర్లు పెట్టింది. అంతకుముందు కూడా ఇలా పలు మార్లు భారత భూభాగాలకు పేర్లు పెట్టింది.

China Border Dispute With Neighbouring Countries : దాదాపుగా సరిహద్దు దేశాలన్నింటితోనూ కయ్యాలమారి డ్రాగన్​కు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. తైవాన్‌, దక్షిణ చైనా సముద్రాలను కూడా తమ దేశంలో అంతర్భాగంగా స్టాండర్డ్‌ మ్యాప్‌లో చైనా పేర్కొంది. దక్షిణ చైనా సముంద్రంలో అతిపెద్ద భాగంగా ఉన్న నైన్‌ డ్యాష్‌ లైన్‌ను కూడా చైనా తమ ప్రాంతంగా మ్యాప్‌లో చూపించింది. దీనిపై వియత్నాం, ఫిలిప్పీన్స్‌, మలేషియా, బ్రూనై దేశాలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

డ్రాగన్​తో 19వ దఫా చర్చలు.. సరిహద్దు సమస్యలు ఈసారైనా కొలిక్కి వచ్చేనా?

అరుణాచల్​లోని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు.. భారత్​ ఫైర్

Last Updated :Aug 31, 2023, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.