ACB Raids on Mahabubabad Transport Department Office : గత కొన్ని రోజులుగా మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయని తెలుసుకున్న ఏసీబీ అధికారులు ఇవాళ ఆకస్మిక దాడులు నిర్వహించారు. దీంతో కార్యాలయంలో అనధికారకంగా ఉన్న ఆరుగురు ఏజెంట్లను, రవాణా శాఖ అధికారి గౌస్ పాషా డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ల నుంచి రూ.45,100, డ్రైవర్ నుంచి రూ.116,500 నగదుతో పాటు నూతన లైసెన్స్లు, రెన్యూవల్స్, ఫిట్నెస్కి సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడి - అదుపులో ఆరుగురు ఏజెంట్లు, ఒక డ్రైవర్
Published : May 28, 2024, 4:52 PM IST