ETV Bharat / international

బ్రెజిల్​లో 28లక్షలు దాటిన కరోనా కేసులు

author img

By

Published : Aug 5, 2020, 7:18 PM IST

WORLD TRACKER
ప్రపంచంపై కరోనా పంజా.. 7 లక్షలు దాటిన మరణాలు

ప్రపంచంపై కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజుకు రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతుండటం వల్ల మొత్తం బాధితుల సంఖ్య కోటీ 87 లక్షలు, మరణాలు 7 లక్షలు దాటాయి. కోటీ 19 లక్షల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు, మరణాల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రోజుకు రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, బ్రెజిల్​, భారత్​ వంటి దేశాల్లో వైరస్​ ప్రభావం అధికంగా ఉంది.

  • మొత్తం కేసులు: 1,87,36,353
  • మరణాలు: 7,05,067
  • కోలుకున్నవారు: 1,19,47,970
  • యాక్టివ్​ కేసులు: 60,83,316

అమెరికాలో..

కరోనా కేసులు, మరణాల్లో అగ్రరాజ్యం దూసుకెళ్తోంది. మొత్తం కేసుల సంఖ్య 50 లక్షలకు చేరువైంది. లక్షా 60వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 24.82 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

బ్రెజిల్​లో..

బ్రెజిల్​లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. 28 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. 96 వేల మందికిపైగా మృతి చెందారు. 19 లక్షల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

పాక్​లో 6వేల మరణాలు..

పాకిస్థాన్​లో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. తాజాగా మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 6,014కు చేరింది. దేశవ్యాప్తంగా కొత్తగా 675 మంది వైరస్​ బారినపడగా.. మొత్తం కేసులు 2.81 లక్షలు దాటాయి.

సింగపూర్​లో..

సింగపూర్​లో వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. బుధవారం రికార్డు స్థాయిలో 908 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో ఇదే అత్యధికం. మొత్తం కేసుల సంఖ్య 54, 254కు చేరింది.

దక్షిణాఫ్రికాలో తగ్గుముఖం..

దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్​ తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసుల నమోదు రేటులో తగ్గుదల కనిపించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 5,21,318 మంది వైరస్​ బారినపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసుల వివరాలు...

దేశం కేసులుమరణాలు
అమెరికా4,919,116160,335
బ్రెజిల్2,808,07696,096
రష్యా866,62714,490
దక్షిణాఫ్రికా521,3188,884
మెక్సికో449,96148,869
పెరు 439,89020,007
చిలీ362,9629,745
స్పెయిన్​349,89428,498
కొలంబియా334,97911,315

ఇదీ చూడండి: దేశంలో 19 లక్షలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.