ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 8.5కోట్లకు చేరువలో కరోనా కేసులు

author img

By

Published : Jan 2, 2021, 7:48 AM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ పంజా విసురుతూనే ఉంది. రోజుకు లక్షల సంఖ్యలో వైరస్​ సోకుతోంది. శుక్రవారం కొత్తగా 5.54 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 8.5 కోట్లకు చేరువైంది. ఇప్పటి వరకు 18.34 లక్షలకుపైగా మంది మరణించారు. అమెరికాతో పాటు బ్రిటన్​లోనూ కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి.

world corona
కరోనా కేసులు

ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి మహావిలయం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఏకంగా 5.54 లక్షల మందికి కొత్తగా వైరస్​ సోకింది. 9 వేలకుపైగా మంది వైరస్​కు బలయ్యారు. ఓ వైపు కరోనా కొత్త స్ట్రెయిన్​ ప్రబలటమూ ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. అయితే.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగటం ఊరట కలిగిస్తోంది. అమెరికాతో పాటు బ్రిటన్​లో కొత్త కేసుల ఉద్ధృతి అధికంగా ఉంది.

మొత్తం కేసులు: 84,354,341

మరణాలు: 1,834,467

కోలుకున్నవారు: 59,622,576

క్రియాశీల కేసులు: 22,897,298

  • అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 1, 65,126 కేసులు నమోదయ్యాయి. 2 వేలకుపైగా మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. 3.56 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
  • యూకేలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఓ వైపు కొత్త స్ట్రేయిన్​తో మళ్లీ లాక్​డౌన్​ దిశగా అడుగులు వేస్తుండగా.. కొత్త కేసులూ పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 53,285 మంది వైరస్​ సోకటం ఆందోళన కలిగిస్తోంది. 613 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 25 లక్షలు దాటింది.
  • అమెరికా, బ్రిటన్​ తర్వాత రష్యాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కొత్తగా 27,039 కేసులు వెలుగుచూశాయి. 536 మంది వైరస్​కు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 32 లక్షలకు చేరువైంది.
  • బ్రెజిల్​, ఇటలీ, భారత్​, ఫ్రాన్స్​లలో రోజుకు 20 వేల వరకు కొత్త కేసులు వస్తున్నాయి. టర్కీ, జర్మనీ, కొలంబియా, మెక్సికో, పోలాండ్​, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో 10వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల వివరాలు ఇలా..

దేశంమొత్తం కేసులుమరణాలు
అమెరికా20,616,428356,428
బ్రెజిల్7,700,578195,441
రష్యా3,186,33657,555
ఫ్రాన్స్​2,639,77364,765
యూకే2,542,06574,125
టర్కీ2,220,85521,093
ఇటలీ 2,129,37674,621
స్పెయిన్1,936,71850,837
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.