ETV Bharat / international

భారత్​కు అప్పగింత తీర్పుపై బ్రిటన్​ సుప్రీం కోర్టుకు మాల్యా

author img

By

Published : May 4, 2020, 11:34 PM IST

మనీలాండరింగ్​ కేసులో తనను భారత్​కు అప్పగించాలని లండన్​ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బ్రిటన్ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడు లిక్కర్​ కింగ్​ విజయ్​ మాల్యా. తీర్పును సమీక్షించాలని కోరాడు.

Vijay Mallya files appeal
భారత్​ అప్పగించాలనే తీర్పుపై విజయ్​ మాల్యా అప్పీల్​

మనీలాండరింగ్, బ్యాంకు మోసాలకు పాల్పడిన కేసులలో విచారణ నిమిత్తం విజయ్​ మాల్యాను భారత్​కు అప్పగించాలని ఏప్రిల్​ 20న తీర్పునిచ్చింది లండన్​ హైకోర్టు. ఈ తీర్పును సమీక్షించాలని బ్రిటన్ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడు మాల్యా. హైకోర్టు ఇచ్చిన రెండు వారాల గడువు ముగుస్తున్నందున ఈ మేరకు సుప్రీంను ఆశ్రయించాడు.

మాల్యా దాఖలు చేసిన అప్పీల్​పై స్పందించేందుకు తమకు మే 14 వరకు సమయముందని భారత్ తరఫున ఈ కేసును వాదిస్తున్న బ్రిటన్​ న్యాయవాది తెలిపారు.

లండన్​ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కచ్చితంగా సమర్థిస్తుందని అక్కడి న్యాయనిపుణులు చెబుతున్నారు. మాల్యాకు భంగపాటు తప్పదని స్పష్టం చేస్తున్నారు హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా వెస్ట్​ మెజిస్ట్రేట్​ కోర్టు ఇచ్చిన తీర్పులో తప్పులేదని చెప్పినట్లు గుర్తు చేశారు.

బ్రిటన్​ కోర్టులో మాల్యాకు చుక్కెదురైతే ఐరోపా మానవ హక్కుల న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది.

భారత్​లో రూ.9,000 కోట్ల మేర బ్యాంకు మోసాలకు పాల్పడినట్లు మాల్యాపై ఆరోపణలున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.