ETV Bharat / international

'కరోనా మూలాలపై పారదర్శక దర్యాప్తు జరగాల్సిందే'

author img

By

Published : Jun 11, 2021, 5:16 AM IST

కరోనా పుట్టుకకు సంబంధించి వీలైనంత తొందరగా సాక్ష్యాధారాలతో సహా.. పారదర్శక స్వతంత్ర దర్యాప్తునకు మద్దతిస్తున్నట్లు అమెరికా-బ్రిటన్​లు ప్రకటించాయి. జీ-7 సమ్మిట్​లో భాగంగా భేటీ అయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​లు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు.

UK, US back 'timely, transparent' WHO-convened COVID-19 origins study
'కరోనా మూలాలపై పారదర్శక దర్యాప్తు జరగాల్సిందే'

కరోనా పుట్టుకకు సంబంధించిన అధ్యయనాన్ని సకాలంలో పారదర్శకంగా పూర్తి చేసే ప్రక్రియకు మద్దతునిస్తున్నట్లు అమెరికా, బ్రిటన్​లు ప్రకటించాయి. జీ-7 సమ్మిట్​లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్‌ల మధ్య జరిగిన భేటీ అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

అమెరికా-బ్రిటన్​ల మధ్య.. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, భద్రత, విజ్ఞానం, ఆవిష్కరణలు, ఆర్థిక శ్రేయస్సులో సహకారం మరింతగా పెంచుకోనున్నట్లు ఇరువురు నేతలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. అలాగే.. వాతావరణ మార్పు, జీవవైవిధ్యానికి వాటిల్లుతున్న నష్టం, విస్తురిస్తున్న ఆరోగ్య ముప్పు అంశాల్లో ఎదురయ్యే సవాళ్లను పరస్పర సహకారంతో పరిష్కరించాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి: వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా- 'అగ్రరాజ్యం' నివేదిక!

ఇదీ చదవండి: Wuhan Lab: అమెరికాకు ఏడాది క్రితమే తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా లక్షల మరణాలకు కారణమైన కరోనా వైరస్ మూలాలు ఒకటిన్నర సంవత్సరం గడచినప్పటికీ అంతుపట్టకుండా ఉన్నాయని.. మహమ్మారిపై పోరులో బైడెన్​తో కలిసి కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు బోరిస్ జాన్సన్ ప్రకటించారు.

ఇవీ చదవండి: 'వుహాన్ ల్యాబ్​ నుంచే కరోనా లీక్- ఇదే సాక్ష్యం'

వుహాన్​ ల్యాబ్​పైనే వారి అనుమానం- తీవ్ర ఒత్తిడిలో చైనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.