ETV Bharat / international

మోడెర్నా టీకాకు బ్రిటన్​ ఓకే

author img

By

Published : Jan 8, 2021, 6:13 PM IST

Updated : Jan 8, 2021, 7:16 PM IST

బ్రిటన్​లో మరో కొవిడ్​ టీకాకు ఆమోదం లభించింది. మోడెర్నా వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి ఆ దేశ ఔషధ నియంత్రణ సంస్థ పచ్చజెండా ఊపింది.

Moderna vaccine
బ్రిటన్​లో మోడెర్నా టీకాకు పచ్చజెండా

కరోనా కొత్త స్ట్రెయిన్​ కేసులతో అల్లాడుతున్న బ్రిటన్​లో.. వైరస్​ కట్టడి చేసే దిశగా మరో అడుగు పడింది. అమెరికా దిగ్గజ సంస్థ మోడెర్నా తయారు చేసిన కొవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు ఆమోదం తెలిపారు. దీంతో ఆ దేశంలో అనుమతి పొందిన మూడో టీకాగా మోడెర్నా నిలిచింది.

ఇప్పటికే.. 70 లక్షల మోడెర్నా టీకా డోసులను బ్రిటన్​ మందస్తుగా ఆర్డర్​ చేసింది. వసంత రుతువు అనంతరం ఈ టీకా డోసులు అక్కడ సరఫరా అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

30,000 మందిపై మోడెర్నా టీకా ట్రయల్స్​ నిర్వహించగా.. 95 శాతం సమర్థతతో పనిచేస్తున్నట్లు తేలింది. దీన్ని మైనస్​ 20 సెంటిగ్రేడ్​ల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.

అంతుకుముందు ఫైజర్​, ఆస్ట్రాజెనెకా టీకాల అత్యవసర వినియోగానికి బ్రిటన్​ ఆమోదం తెలిపింది. ఇప్పటికే.. దాదాపు 15 లక్షల మందికి ఈ టీకాల మొదటి డోసును వేశారు.

ఇదీ చూడండి:అమెరికా, బ్రెజిల్​లో కరోనా మరణ మృదంగం

Last Updated : Jan 8, 2021, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.