ETV Bharat / international

కరోనా నియంత్రణకు బ్రిటన్​ కొత్త వ్యూహం

author img

By

Published : Sep 14, 2020, 7:08 PM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ విలయతాండవం కొనసాగుతోంది. ఇప్పటివరకు 2 కోట్ల మంది 92 వేల మంది వైరస్​ బారినపడ్డారు. 9లక్షల 29వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్​ను నియంత్రించేందుకు మళ్లీ లాక్​డౌన్​ వంటి నిబంధనల్ని అమలు చేస్తున్నాయి వేర్వేరు దేశాలు.

Rule of six comes in to limit gatherings in England's COVID-19 fight
కరోనా నియంత్రణకు ఇంగ్లాండ్​ కొత్త వ్యూహం

ప్రపంచంపై కరోనా రక్కసి విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు 2.92 కోట్ల మందికిపైగా కరోనా సోకింది. 9.29లక్షల మందికిపైగా చనిపోయారు. 2 కోట్ల 10లక్షల మందికిపైగా వైరస్​ నయం కాగా.. మరో 72లక్షల యాక్టివ్​ కేసులున్నాయి.

ఇటలీలో 7నెలల తర్వాత..

కొవిడ్​ ధాటికి విలవిల్లాడిన ఇటలీలో వైరస్​ తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. ఏడు నెలల క్రితం వైరస్​ హాట్​స్పాట్​గా మారిన కొడొగ్నో ప్రాంతంలో కొత్త కేసులు తగ్గినందున పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. రెండు నెలల కఠిన లాక్​డౌన్​ అనంతరం.. సుమారు 80లక్షల మంది విద్యార్థుల్ని పాఠశాలకు పంపేందుకు సిద్ధమయ్యారు వారి తల్లిదండ్రులు. అయితే.. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న 11 రెడ్​జోన్​ ప్రాంతాల్లో మాత్రం పాఠశాలల నిర్వహణపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం.

బ్రిటన్ కొత్త వ్యూహం..

కరోనాను అరికట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం 'రూల్​ ఆఫ్​ సిక్స్​'ను అమలులోకి తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం.. ఒకేచోట ఆరుగురు కంటే ఎక్కువమంది సమావేశం కాకూడదు. నిబంధనల్ని ఉల్లంఘించిన వారికి 100 పౌండ్లు జరిమానా విధిస్తారు పోలీసులు. కొవిడ్​ కేసులను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ప్రధాని బోరిస్​ జాన్సన్.

ఇండోనేషియాలో..

ఇండోనేషియా రాజధాని జకార్తాలో వైరస్​ బాధితులతో.. అక్కడి ఆసుపత్రులన్నీ దాదాపు నిండిపోయాయి. దీంతో సోమవారం నుంచి రెండు వారాలపాటు లాక్​డౌన్​ ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఆసుపత్రుల్లో, రహదారుల్లో రద్దీ తగ్గించడం సహా.. కొవిడ్​ను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. అత్యవసర సేవలతో కూడిన 11 రంగాలు మాత్రం 50శాతం సిబ్బందితో కొనసాగనున్నాయి.

వేర్వేరు దేశాల్లో కొవిడ్​ కేసుల వివరాలు..

  • కరోనా కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 67.11 లక్షల మందికి వైరస్​ సోకింది. 1.98 లక్షల మంది మరణించారు.
  • బ్రెజిల్​లో ఇప్పటివరకు 48.5 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 1.31 లక్షల మందిపైగా ప్రాణాలు కోల్పోయారు.
  • పాక్​లో కొత్తగా 539 మందికి కొవిడ్​ సోకింది. ఫలితంగా బాధితుల సంఖ్య 3,02,020కి చేరింది. ఇప్పటివరకు ఆ దేశంలో 6,383 మంది చనిపోయారు.
  • సింగపూర్​లో 48 కొత్త కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 57,454కు చేరింది.

ఇదీ చదవండి: జపాన్​ ప్రధానిగా 'యోషిహిడే సుగా' ఎంపిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.