ETV Bharat / international

ఎలిజబెత్‌ రాణి-2 పాలనకు ప్లాటినం జూబ్లీ

author img

By

Published : Feb 6, 2022, 7:58 AM IST

Queen's platinum jubilee: క్వీన్​ ఎలిజబెత్​-2 బ్రిటిష్​ గద్దెనెక్కి నేటికి 70 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా బ్రిటన్​లో ప్లాటినం జూబ్లీ వేడుకలు జరగనున్నాయి. సూదీర్ఘకాలం పాటు బ్రిటన్​ను పారిపాలించిన ఏకైక రాజవంశానికి చెందిన మహిళ ఈమనే కావడం విశేషం.

Queen Elizabeth II set to be 1st British monarch to celebrate 70 years of reign
ఎలిజబెత్‌ రాణి-2 పాలనకు ప్లాటినం జూబ్లీ

Queen's platinum jubilee: ఎలిజబెత్‌ రాణి-2 బ్రిటిష్‌ సింహాసనాన్ని అధిరోహించి ఫిబ్రవరి 6వ తేదీతో 70 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా బ్రిటన్‌ అంతటా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరగనున్నాయి. ఇంత సుదీర్ఘ కాలం బ్రిటన్‌ను పాలించిన తొలి రాజవంశీకురాలు ఆవిడే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జరిగే సంబరాలు జూన్‌ 2-5 మధ్య నాలుగురోజుల సెలవుదినాలతో ముగుస్తాయి.

95 ఏళ్ల ఎలిజబెత్‌ రాణి-2 దేశానికి అందించిన సేవలను గౌరవిస్తూ ఈ నాలుగు రోజుల్లో విందు వినోదాలు, ప్లాటినం పుడ్డింగ్‌ తయారీ పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో అయిదుగురిని తుది పోటీలకు ఎంపిక చేస్తారు. విజేతను బకింగ్‌హాం ప్యాలెస్‌ ప్రధాన చెఫ్‌ మార్క్‌ ప్లానగన్‌తో పాటు టీవీ వంటల కార్యక్రమ జడ్డీలు మోనికా గాలెట్టి, మేరీ బెర్రీ నిర్ణయిస్తారు. పోటీలో నెగ్గిన వంటకాన్ని ప్రజలకు ప్రదర్శిస్తారు. జూన్‌లో రెండో శనివారం రాణి జన్మదిన వేడుకలో భాగంగా సైనిక కవాతు జరుగుతుంది. బ్రిటిష్‌ వాయుసేన విమానాల ప్రదర్శనతో ఈ కవాతు ముగుస్తుంది.

తదుపరి రాణి ఆమే..!

ప్రిన్స్ చార్లెస్ రాజు అయినప్పుడు డచెస్ ఆఫ్ కార్న్‌వాల్ కెమిల్లానే రాణి అవుతుందని క్వీన్ ఎలిజబెత్-2 అన్నారు. శనివారం జరిగిన రాణి ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా జాతినుద్దేశించి ఇచ్చిన సందేశంలో కెమిల్లానే తరువాత రాణి అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనకు అందించిన సహకారమే తన కుమారుడు, కోడలుకు కూడా అందించాలని కోరారు. ఇన్ని రోజులు తమ కుటుంబంపై విధేయతను కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Queen Elizabeth II
రాణి ఎలిజిబెత్​ 2 తో డచెస్ ఆఫ్ కార్న్‌వాల్ కెమిల్లా

ఇదీ చూడండి: ఉక్రెయిన్​ సరిహద్దుల్లో రష్యా యుద్ధ విమానాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.