ETV Bharat / international

రాజకుటుంబానికి హ్యారీ-మేఘన్​ దంపతులు గుడ్​బై

author img

By

Published : Feb 20, 2021, 5:04 AM IST

తమ రాచరిక హోదాలను బ్రిటన్​ రాకుమారుడు హ్యారీ దంపతులు అధికారికంగా కోల్పోయినట్లు ఆ దేశ రాజ సౌధం బంకింగ్​హాం ప్యాలెస్​ ప్రకటించింది. గత ఏడాది క్రితం తీసుకున్న నిర్ణయానికే వారు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం హ్యారీ దంపతులు అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు.

Britain price harry
రాజకుటుంబానికి బ్రిటన్​ యువరాజు హ్యారీ దంపతులు రాంరాం

బ్రిటన్‌రాకుమారుడు హ్యారీ అతని భార్య మేఘన్‌ మార్కె‌ల్​ అన్ని రాచరిక హోదాలు అధికారికంగా కోల్పోయారు. వారు తిరిగి రాజకుటుంబంతో కలిసేందుకు ఇష్టపడటం లేదని బ్రిటన్ రాజసౌధం బంకింగ్‌హాం ప్యాలెస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఏడాది క్రితం ప్రిన్స్ హ్యారీ దంపతులు రాజ వంశ సంబంధ విధుల నుంచి తప్పుకున్నారు. వీరి చర్యతో బ్రిటిష్ రాజ వంశం పెద్ద కుదుపునకు గురైంది. ఈక్రమంలో మహారాణి ఎలిజబెత్-2.. ప్రిన్స్ హ్యారీతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవల్సిందిగా ఏడాది గడువు ఇచ్చారు. గడువు ముగిసినప్పటికీ.. తాము తొలుత తీసుకున్ననిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు హ్యారీ దంపతులు స్పష్టం చేశారు. రాజ కుటుంబంలోకి తిరిగి రాబోమని తెల్చిచెప్పారు. ఈమేరకు తమకు లభించిన గౌరవపూర్వక సైనిక పదవులు, హక్కులను కూడా వదులుకున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం హ్యారి దంపతులు అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు.

ఇదీ చూడండి: బ్రిటన్​ కోర్టులో ఉబర్​కు చుక్కెదురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.