ETV Bharat / international

పెగాసస్​ డేటా లీక్​పై ఫ్రాన్స్ దర్యాప్తు!

author img

By

Published : Jul 22, 2021, 2:09 PM IST

Updated : Jul 22, 2021, 2:52 PM IST

పెగాసస్​ డేటా లీక్​ వ్యవహారాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయంపై అక్కడి దర్యాప్తు సంస్థలతో విడివిడిగా విచారణ చేయిస్తున్నట్లు తెలిసింది.

France investigation into Pegasus data
పెగాసస్​పై విచారణకు ఆదేశే

ప్రపంచవ్యాప్తంగా పెగాసస్​ స్పైవేర్​ కలకలం రేపుతోంది. ఈ స్పైవేర్​ ద్వారా డేటా లీక్​ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్.. ఆ దేశంలోని​ వివిధ దర్యాప్తు సంస్థలను ఆదేశించారు. మేక్రాన్​ ఫోన్ నంబర్​ సహా ఆ దేశ మాజీ ప్రధాని, 20 మది కేబినెట్​ మంత్రుల వివరాలు లీకైనట్లు తెలిసిన నేపథ్యంలో ఈ విచారణకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

పెగాసస్​ లీకేజీ వ్యవహారంపై అధ్యక్ష భననం ఎలీసీ.. వేర్వేరు దర్యాప్తు సంస్థలను విడివిడిగా విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు ప్రధాని జీన్​ కాస్టెక్స్ వెల్లడించారని ఓ వార్తా సంస్థ పేర్కొంది. అయితే ఈ అంశంపై ఇప్పుడే మరిన్ని వివరాలు వెల్లడించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డట్లు వివరించింది.

డేటా లీక్​పై ఆందోళన..

ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ సహా దాదాపు 20 మంది కేబినెట్ మంత్రులు, ప్రజా ప్రతినిధుల ఫోన్​ నంబర్లు, ఇతర వివరాలు లీకైనట్లు ఇటీవల తెలిసింది. మొత్తం లీకైన 50వేల ఫోన్​ నంబర్ల లిస్ట్​లో వీరి నంబర్లు ఉన్నట్లు వెల్లడైంది. ఇందులో న్యాయ, విదేశీ వ్యవహారాల శాఖలకు చెందిన వివరాలు కూడా ఉన్నట్లు తేలింది. దీనితో మేక్రాన్​ సహా ఇతర మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారని ఓ మీడియా కథనం పేర్కొంది.

ఇదీ చదవండి:Pegasus spyware: 'అదే నిజమైతే ఎర్రగీత దాటినట్లే'

Last Updated : Jul 22, 2021, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.