'కొవాగ్జిన్‌ టీకాపై మరికొంత సమాచారం అందాలి'

author img

By

Published : Oct 19, 2021, 7:43 AM IST

covaxin

కొవాగ్జిన్​ టీకాకు అత్యవసర వినియోగ అనుమతికి సంబంధించి డబ్ల్యూహెచ్​ఓ (WHO on Covaxin) కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సిన్​కు సంబంధించి మరికొంత సమాచారం రావాల్సి ఉందని తెలిపింది.

భారత్‌ బయోటెక్‌ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్‌ టీకాపై (WHO on Covaxin) మరొక్క సమాచారం రావాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం వెల్లడించింది. అత్యవసర వినియోగానికి అనుమతించే ముందు (WHO on Covaxin) దాని పనితీరు, భద్రతను పూర్తిస్థాయిలో విశ్లేషించాల్సి ఉంటుందని ట్వీట్‌లో పేర్కొంది.

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ తాము అభివృద్ధిపరిచిన కొవాగ్జిన్‌ టీకాకు సంబంధించి డబ్ల్యూహెచ్‌వోకు (WHO on Covaxin) ఏప్రిల్‌ 19న దరఖాస్తు చేసుకుంది. "మా నిపుణులు కోరుతున్న సమాచారాన్ని భారత్‌ బయోటెక్‌ అందజేస్తూ వస్తోంది. దానిని విశ్లేషిస్తూ అవసరమైన వివరాలు కోరుతున్నాం. ఇప్పుడు అదనంగా మరొక్క సమాచారం రావాల్సి ఉంది" అని డబ్ల్యూహెచ్‌వో ఆ ట్వీట్‌లో పేర్కొంది. కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి జారీ విషయమై సాంకేతిక నిపుణుల బృందం ఈ నెల 26న భేటీ కాబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్యాస్వామినాథన్‌ వెల్లడించారు.

ఇదీ చూడండి : Vaccine Mixing: టీకా మిక్సింగ్​తో తగ్గుతున్న కరోనా ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.