ETV Bharat / international

Omicron severity: ''ఒమిక్రాన్' ముప్పు వారికే అధికం'

author img

By

Published : Dec 21, 2021, 4:14 PM IST

omicron  severity
ఒమిక్రాన్ తీవ్రత

Unvaccinated omicron severity: కరోనా ఒమిక్రాన్ వేరియంట్​పై దక్షిణాఫ్రికా వైద్యురాలు ఒకరు కీలక విషయాలు వెల్లడించారు. వ్యాక్సిన్ వేసుకున్నవారితో పోలిస్తే వేసుకోనివారిపై ఒమిక్రాన్ తీవ్రత అధికంగా ఉంటుందని, ఆస్పత్రుల్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఒమిక్రాన్ బాధితులు సాధారణ చికిత్స ద్వారా వైరస్​ నుంచి కోలుకుంటారని పేర్కొన్నారు.

Unvaccinated omicron severity: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అధిక వేగంతో విస్తరించే లక్షణాలు... ఈ వేరియంట్​కు ఉన్నందున వివిధ దేశాల్లో బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్​ వ్యాధి తీవ్రతపై దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్​ ఛైర్​పర్సన్​ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ కీలక విషయాలు వెల్లడించారు. టీకాలు తీసుకోని వారిపై ఈ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆమె పేర్కొన్నారు.

"ఒమిక్రాన్ బారినపడిన వారిలో ఎక్కువ ప్రభావానికి గురైన కేసులను నేను చూడలేదు. ఒమిక్రాన్ బాధితుల్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయి. అయితే.. టీకా తీసుకోని వారు వ్యాధి ప్రభావానికి ఎక్కువగా గురికావడం, ఆస్పత్రుల్లో చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో వ్యాక్సిన్ వేసుకోనివారితో పోలిస్తే వ్యాక్సిన్ వేసుకున్నవారిలో స్పల్ప లక్షణాలు ఉన్నాయని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అయితే.. ఈ విషయంలో ప్రస్తుతం మార్పులు జరుగుతున్నాయి. టీకా తీసుకున్నవారు కూడా చాలా మంది రీఇన్​ఫెక్షన్​, బ్రేక్​త్రూ ఇన్​ఫెక్షన్​కు గురవుతున్న సందర్భాలను నేను చూస్తున్నాను. బ్రేక్​త్రూ ఇన్​ఫెక్షన్ కేసుల్లో చాలా మంది గతంలో కరోనా సోకనివారే ఉన్నారు."

-డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ, దక్షిణాఫ్రికా వైద్యురాలు.

Omicron south africa: టీకా ఒక్క డోసు తీసుకున్నవారిలో కూడా ఒమిక్రాన్ బారినపడిన తర్వాత వారిలో స్వల్ప లక్షణాలే కనిపించాయని డాక్టర్ కోయెట్జీ తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ బాధితుల్లో చాలా తక్కువ మందికి మాత్రమే ఐసీయూలో చికిత్స అందించాల్సి వచ్చిందని చెప్పారు. డెల్టా వేరియంటే భయంకరమైనదని ఆమె పేర్కొన్నారు.

చిన్నారులపై ప్రభావమెంత?

Children omicron: చిన్నారులు ఒమిక్రాన్​ బారినపడడంపై కోయెట్జీ స్పందించారు. అయితే.. కరోనాతోపాటు ఇతర సమస్యలు ఉండడం వల్లే చిన్నారులు ఐసీయూలో చేరాల్సి వస్తోందని చెప్పారు. ప్రస్తుతానికి డెల్టాతో పోలిస్తే చిన్నారులపై ఒమిక్రాన్ ప్రభావం చూపించలేదని పేర్కొన్నారు. ఒమిక్రాన్ బాధిత చిన్నారుల్లో కొన్ని విభిన్న లక్షణాలు ఉన్నాయని తెలిపారు.

సులభ చికిత్సతోనే..

ఒమిక్రాన్ బాధితులు.. సాధారణ, సులభమైన చికిత్స ద్వారా వ్యాధి నుంచి కోలుకుంటున్నారని కోయెట్జీ తెలిపారు. ఆక్సిజన్, యాంటీబాడీ ఔషధాల వాడకం అవసరం లేకుండానే చికిత్స అందించవచ్చని తెలిపారు. ఒమిక్రాన్ బాధితుల్లో చాలా మందికి శరీర నొప్పులు, తల నొప్పి, అలసట వంటి లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.