ETV Bharat / bharat

India omicron variant: 'ఒమిక్రాన్'​తో మరో ముప్పు తప్పదా?

author img

By

Published : Dec 18, 2021, 6:14 PM IST

India omicron variant
ఒమిక్రాన్ వేరియంట్

India omicron variant: కరోనా ఒమిక్రాన్ వేరియంట్​​... ప్రపంచ దేశాలను ఈ పేరు వణికిస్తోంది. మనదేశంలోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు.. టీకాలు తీసుకున్నవారూ ఈ వేరియంట్​ కారణంగా వైరస్ బాధితులుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరి 'ఒమిక్రాన్'ను ఎదుర్కోవడమెలా? దేశంలో ఒమిక్రాన్​తో థర్డ్​ వేవ్ తప్పదా? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..?

India omicron variant: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 100కుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ కారణంగా దేశంలో థర్డ్ వేవ్ ముుంచుకువచ్చే అవకాశాలున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్​ను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. ప్రజలంతా తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలని హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని ప్రభుత్వం నిశితంగా గమనించాలని.. కట్టడికి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.

Health experts on omicron: ఒమిక్రాన్​ వేరియంట్ తక్కువ వ్యాధి తీవ్రతనే కలిగిస్తున్నప్పటికీ.. అత్యధిక వేగంతో వ్యాపిస్తుండటం ఆందోళనకర అంశమని పీఎస్​ఆర్​ఐ ఆస్పత్రి క్రిటికల్​ కేర్ అండ్ స్లీప్​ మెడిసిన్​, పల్మనాలజీ ఛైర్మన్ డాక్టర్ జీసీ ఖిల్నానీ తెలిపారు. కరోనా రెండో దశలో పాటించిన జాగ్రత్తలనే మళ్లీ పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

"కరోనా రెండో దశ వ్యాప్తి సమయంలో పశ్చిమ ఐరోపా దేశాల్లో వైరస్​ విజృంభించిన తర్వాత భారత్​లో మహమ్మారి అధికంగా వ్యాపించడాన్ని మనం చూశాం. అందువల్ల రెండో దశ మహమ్మారి సమయంలో ఎంతటి అప్రమత్తతతో వ్యవహరించామో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలే పాటించాలి."

-డాక్టర్ జీసీ ఖిల్నానీ, పీఎస్​ఆర్​ఐ ఆస్పత్రి.

Vaccines over omicron: "రోజులు గడుస్తున్న కొద్దీ వ్యాక్సిన్ల ద్వారా అందే రక్షణ తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి బూస్టర్ డోసు అందించాల్సిన ఆవశ్యకత ఉంది. అత్యధిక వేగంతో ఒమిక్రాన్ వేరియంట్​ వ్యాపిస్తుందని ఇప్పటివరకు ఉన్న సమాచారం ఆధారంగా తెలుస్తోంది. కానీ, భారత్​లో నమోదైన ఒమిక్రాన్ బాధితుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి" అని డాక్టర్ ఖిల్నానీ పేర్కొన్నారు.

'థర్డ్​ వేవ్ తప్పకపోవచ్చు'

Delta vs Omicron: "డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ... 70 రెట్లు అధికంగా వ్యాపిస్తుండటం ఆదోళనకర అంశం" అని మహవీర్ మెడికల్ కళాశాలలో గైనకాలజీ విభాగంలో సేవలందించే డాక్టర్ షీబా మార్వా తెలిపారు. టీకాలను ఏమార్చే సామర్థ్యం ఈ వేరియంట్​కు ఉన్నందున దేశంలో థర్డ్ వేవ్​ ముప్పు ముంచుకువచ్చే అవకాశం ఉందని చెప్పారు.

ఇదీ చూడండి: స్పుత్నిక్‌ లైట్‌ బూస్టర్‌తో 'ఒమిక్రాన్‌' దూరం

covid surge in india: భారత్​లో కరోనా పరిస్థితులపై మరోసారి దేశ ప్రజలను కేంద్రం హెచ్చరించింది. బ్రిటన్​, ఫ్రాన్స్​ తరహా పరిస్థితులు మన దేశంలో నెలకొంటే రోజుకు 14 లక్షలకు పైగా కేసులు నమోదు అవుతాయని కరోనా టాస్క్​ఫోర్స్​ చీఫ్​ వీకే పాల్​ అన్నారు. కరోనా నిబంధనలు అందరూ కచ్చితంగా పాటించాలని కోరారు.

Omicron Cases India: దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్​.. దేశంలో​ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్‌ 11 రాష్ట్రాలకు పాకగా మొత్తంగా 111 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా వైరస్​ కట్టడి కోసం అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పింది.

ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం తెలిపింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. "అత్యవసరం కాని ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేస్తే మంచిది. ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఒకచోట గుమిగూడొద్దు. పండగల వేళ మరింత అప్రమత్తంగా ఉండాలి. కొత్త సంవత్సర వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలి" అని పేర్కొంది.

ఇదీ చూడండి: టీకా మూడు డోసులు తీసుకున్న వ్యక్తికి.. ఒమిక్రాన్ పాజిటివ్!

ఇదీ చూడండి: 'బ్రేక్​ త్రూ ఇన్​ఫెక్షన్​లతో ఇతర వేరియంట్ల నుంచి రక్షణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.