ETV Bharat / international

వృద్ధాశ్రమంలో ఘోర అగ్నిప్రమాదం- 9 మంది మృతి

author img

By

Published : May 11, 2020, 7:16 PM IST

రష్యా మాస్కోలోని ఓ నర్సింగ్​ హోంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో 9 మందిని ఆసుపత్రికి తరలించారు. విద్యుదాఘాతం వల్లే మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.

At least 9 die in fire at Russian care home
వృద్ధాశ్రమంలో ఘోర అగ్నిప్రమాదం.. 9మంది మృతి

వృద్ధాశ్రమంలో ఘోర అగ్నిప్రమాదం

రష్యా మాస్కో శివార్లలోని ఓ వృద్ధాశ్రమంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మందిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్​ వల్లే ఈ మంటలు చెలరేగాయని చెప్పారు.

ఈ నర్సింగ్​ హోంను ప్రైవేటు భవనంగా నమోదు చేశారని, ఇందులో ఫైర్​ అలారం, తదితర అత్యవసర పరికరాలు అందుబాటులో లేవని అధికారులు తెలిపారు. అగ్నిమాపక భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా.. పోలీసులు భవన యజమానిని అదుపులోకి తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.