ETV Bharat / international

మయన్మార్​ రక్తపాతం: 38కి చేరిన మృతులు

author img

By

Published : Mar 4, 2021, 11:48 AM IST

మయన్మార్​లో నిరసనలు తెలుపుతున్న వారిపై సైన్యం బుధవారం జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 38కి పెరిగింది. ఈ ఘటనను ఐరాస తీవ్రంగా ఖండించింది. కాల్పులు జరిగిన రోజును బ్లడియస్ట్​ (రక్తసిక్తమైన) డేగా అభివర్ణించింది.

Myanmar
మయన్మార్​లో రక్తపాతం

మయన్మార్​లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న ప్రజలపై సైన్యం బుధవారం జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 38 మందికి చేరింది.

గత నెల రోజులుగా జరుగుతున్న నిరసన ప్రదర్శనల్లో సైన్యం ఎటువంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండా టియర్‌ గ్యాస్‌ ప్రయోగించినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అనంతరం కాల్పులు జరిపారని చెప్పారు. ఈ కాల్పుల్లో ఎక్కువ మంది చిన్నారులు గాయపడ్డారు. పెద్ద నగరాలైన యాంగూన్, మాండలే సహా పలు ప్రాంతాల్లోని ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరిపిందని అక్కడి మీడియా పేర్కొంది.

సంయమనం పాటించాలంటూ మయన్మార్ సైన్యానికి పొరుగు దేశాలు సూచించిన మరునాడే దేశంలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘటనను వివిధ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్యసమితి 'రక్తసిక్తమైన రోజు'గా అభివర్ణించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.