ETV Bharat / international

Taliban news: విమానాల పునరుద్ధరణ కోసం భారత్​కు తాలిబన్ల లేఖ

author img

By

Published : Sep 29, 2021, 1:27 PM IST

అఫ్గానిస్థాన్​కు విమాన సేవలను పునరుద్ధరించాలని(flights to afghanistan from india) కోరుతూ భారత్​కు లేఖ రాశారు తాలిబన్లు(Afghanistan Taliban). ప్రస్తుతం వారి లేఖను పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ పరిశీస్తున్నట్లు సమాచారం.

Taiban's
విమానాల పునరుద్ధరణ కోసం భారత్​కు తాలిబన్ల లేఖ

అఫ్గానిస్థాన్​ను ఆక్రమించుకున్న తాలిబన్లు(Afghanistan Taliban).. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. వివిధ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, కాబుల్​కు విమాన సేవలు కొనసాగేలా పూర్తి సహకారం అందిస్తామని ఇటీవలే ప్రకటించారు. తాజాగా.. తమ దేశానికి విమానాలను పునరుద్ధరించాలని(flights to afghanistan from india) కోరుతూ భారత పౌర విమానయాన శాఖ డైరెక్టర్​ జనరల్​కు లేఖ రాశారు.

అఫ్గానిస్థాన్​లోని కాబుల్​కు వాణిజ్య విమానాలు(ప్రయాణికులు, సరకు రవాణా) పునరుద్ధరించాలని కోరుతూ డీజీసీఏకు లేఖ రాసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం లేఖను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

కాబుల్​ను తాలిబన్లు తమ అధీనంలోకి తెచ్చుకున్న క్రమంలో ఆగస్టు 15 తర్వాత అఫ్గాన్​కు అన్ని రకాల విమానాలను నిలిపివేసింది భారత్​.

ఇదీ చూడండి: Taliban news: 'భరోసా ఇస్తాం.. విమాన సర్వీసులు ప్రారంభించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.