ETV Bharat / international

కొరియా, చైనాల్లో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా

author img

By

Published : Aug 23, 2020, 1:19 PM IST

కరోనా వైరస్​ తగ్గుముఖం పట్టిన దేశాల్లో మళ్లీ విజృంభిస్తోంది. దక్షిణ కొరియాలో మరో 397 మందికి వైరస్​ సోకింది. వరుసగా 10 రోజుల నుంచి మూడంకెల సంఖ్య నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అలాగే చైనాలో ఇవాళ 12, పాకిస్థాన్​లో 591 మంది మహమ్మారి బారినపడ్డారు.

South Korea sees steady rise in virus cases
దక్షిణ కొరియా, చైనా దేశాల్లో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా

దక్షిణ కొరియాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా మరో 397 కేసులు వెలుగుచూసినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. వరుసగా 10 రోజుల నుంచి మూడంకెల సంఖ్య నమోదవుతున్నట్లు తెలిపారు. ఆ దేశ రాజధానితో పాటు ఇతర ప్రధాన నగరాల్లోనూ ఎక్కువ కేసులు బయటపడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

కేసులు పెరగడానికి భౌతిక దూరం పాటించకపోవటమే కారణమని భావించిన అధికారులు ప్రార్థనా మందిరాలు, బీచ్​లు, క్రీడా ప్రాంగణాలు, ప్రజలు ఎక్కువగా సంచరించే ఇతర ప్రదేశాలపై ఆంక్షలు విధించారు.

  • చైనాలో ఇవాళ 12 మందికి వైరస్​ సోకింది. వీటితో పాటు విదేశాల నుంచి వచ్చినవారిలో లక్షణాలు లేని మరో 15 కేసులును గుర్తించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 84,951 కేసులు నమోదయ్యాయి. దాదాపు 80 వేల మంది కోలుకోగా.. ప్రస్తుతం 400 యాక్టివ్​ కేసులున్నాయి.
  • పాకిస్థాన్​లో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా 591 మందికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయ్యింది. మొత్తం 6,235 మంది మరణించగా.. మొత్తం కేసుల సంఖ్య 2,75,836గా ఉందని అధికారులు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.