ETV Bharat / international

పాకిస్థాన్ మళ్లీ​ గ్రే లిస్టులోనే: ఎఫ్​ఏటీఎఫ్​

author img

By

Published : Feb 26, 2021, 5:30 AM IST

paksitan in grey list of fatf
పాకిస్థాన్​ గ్రే లిస్టులోనే కొనసాగుతుంది​: ఎఫ్​ఏటీఎఫ్​

పాకిస్థాన్​​ 'గ్రే' జాబితాలోనే కొనసాగుతుందని ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ ఫోర్స్​ తెలిపింది. మూడు కీలక విధులను నిర్వర్తించడంలో పాక్​ విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఉగ్రవాదులపై ఆర్థిక ఆంక్షలను ఆ దేశం సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పింది.

అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్​కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మూడు కీలక విధులను నిర్వర్తించడంలో​ విఫలమైనందున.. ఆ దేశం గ్రే జాబితాలోనే కొనసాగుతుందని ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ఫోర్స్​(ఎఫ్​ఏటీఎఫ్​) గురువారం స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు మనీలాండరింగ్​ వ్యవహారాన్ని తనిఖీ చేయడంలో పాక్​​ వైపు లోపాలు ఉన్నాయని ​పేర్కొంది. ఈ మేరకు ప్లీనరీ సమావేశం అనంతరం వెల్లడించింది.

ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, వారి అనుచరులకు వ్యతిరేకంగా పాకిస్థాన్​ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఎఫ్ఏ​టీఎఫ్​ తెలిపింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారికి ఆ దేశ​ న్యాయస్థానాలు తగిన శిక్షలు విధించాలని పేర్కొంది. ఉగ్రవాదులపై ఆర్థిక ఆంక్షలను సమర్థవంతంగా అమలు చేయాలని, ఇందుకోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

జూన్​ సమావేశంలో

మొత్తం 27 విధులను నిర్వర్తించాలని తెలపగా.. 24 విధులనే పాకిస్థాన్​ పూర్తి చేసిందని ఎఫ్​ఏటీఎఫ్​ తెలిపింది. నిర్దేశించిన గడువు ఇప్పటికే ముగిసినందున మిగతా విధులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పింది. అనంతరం.. జూన్​లో జరిగే ప్లీనరీ సమావేశంలో పాక్​ పరిస్థితిపై సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

ఇదీ చదవండి:'పేదరికంపై చైనా సంపూర్ణ విజయం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.