ETV Bharat / international

వాటిపై ధరలు తగ్గించాలని చైనాకు భారత్​ విజ్ఞప్తి

author img

By

Published : May 14, 2021, 6:47 PM IST

వైద్య సంబంధమైన ముడిసరకులపై పెంచిన ధరలను తగ్గించాలని చైనాకు భారత్​ విజ్ఞప్తి చేసింది. నిలిపేసిన కార్గో విమానాలను పునరుద్ధరించాలని కోరింది.

India
చైనా, భారత్

అత్యవసర వైద్య సామగ్రిపై, ముడిసరకులపై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని చైనాను భారత్​ కోరింది. భారత్​కు కార్గో విమాన సర్వీసుల్ని తక్షణమే నడపాలని సూచించింది.

"ఆక్సిజన్​ ఉన్న సిలిండర్లపై పెంచిన ధరలను తగ్గించాలి. భారత్​కు నిలిపేసిన కార్గో విమానాల్ని తక్షణమే నడపాలి. ఈ అత్యవసర సమయంలో మేము ఆశించేది ఇదే."

-ప్రియాంక చౌహాన్​, హాంకాంగ్​లోని భారత రాయబారి

భారత్​కు కరోనా సమయంలో 50 దేశాలు సహాయం చేశాయని ఈ సందర్భంగా ప్రియాంక గుర్తు చేశారు. కారణం లేకుండా కార్గోవిమాన సర్వీసుల్ని నిలిపేయడం సరికాదని అన్నారు.

కరోనా వ్యాపిస్తోందని ఏప్రిల్​ 26 నుంచి చైనాలోని షిచువాన్​ ఎయిర్​లైన్స్​ 11 కార్గో విమానాల్ని 15 రోజులపాటు భారత్​కు రాకుండా నిషేధం విధించింది. అయితే కార్గో విమాన సర్వీసుల్ని పునరుద్ధరిస్తున్నామని ఇటీవలే ప్రకటించింది. కానీ ఇంతవరకు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కాలేదు.

'డిమాండ్​ వల్లే ధరలు పెరిగాయి'

"అనతి కాలంలోనే వైద్య సంబంధమైన ముడిసరకుల కోసం భారత్​ నుంచి భారీ డిమాండ్​ రావడం వల్ల కొరత ఏర్పడింది. దాంతో ముడిసరకుల ధరలు పెరిగాయి" అని చైనా విదేశాంగ శాఖ కార్యదర్శి హూవా చూయింగ్ అన్నారు.

ఏప్రిల్​లో భారత్​కు 26,000 వెంటిలేటర్లను, ఆక్సిజన్​ సిలిండర్లను పంపించామని తెలిపారు. వాటితో పాటు 15,000 మానిటర్స్​, 3,800 టన్నుల వైద్యసామగ్రిని, మందుల్ని పంపించామని గుర్తుచేశారు. మే, జూన్​ నాటికి మరో 20టన్నుల వైద్యసంబంధిత ముడిసరకుల్ని పంపిస్తామని అన్నారు.

భారత్​కు కార్గోవిమాన సర్వీసుల్ని తిరిగి ప్రారంభించాలని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్​ జైశంకర్​.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీని ఫోన్​లో కోరారు. అయినా ఈ విషయంలో ఇంతవరకు ఏ కదలికరాలేదు.

ఇదీ చదవండి: భారత్​-ఆస్ట్రేలియా విమాన సేవల పునరుద్ధరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.