ETV Bharat / international

'బిన్​ లాడెన్​ ఎక్కడ దొరికాడో మరిచిపోయారా?'

author img

By

Published : Nov 25, 2020, 11:33 AM IST

Updated : Nov 25, 2020, 12:18 PM IST

పాకిస్థాన్​ ఎప్పుడూ ఆసత్య ప్రచారాలే చేస్తుందని భారత్ తీవ్రంగా మండిపడింది. తప్పుడు పత్రాలు, కథనాలు సృష్టించడం పాక్​కు కొత్తేమీ కాదని విమర్శించింది. తమ దేశంలోకి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని పాక్​ చేసిన ఆరోపణల నేపథ్యంలో భారత్ ఈ మేరకు స్పందించింది. అబోటాబాద్​ ఘటనను మరిచిపోవద్దని ఐరాసలో భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి అన్నారు.

abbottabad
అబోటాబాద్

ఐక్యరాజ్యసమితిలో దిల్లీకి సంబంధించి అసత్య ఆరోపణలు చేస్తోన్న పాకిస్థాన్​పై తీవ్ర స్థాయిలో మండిపడింది భారత్​. తప్పుడు పత్రాలు, కథనాలు సృష్టించడం ఆ దేశానికి కొత్తేమీ కాదని పేర్కొంది. ఐరాస నిషేధిత ఉగ్రవాదులు ఎందరికో పాకిస్థాన్​ ఆశ్రయం ఇచ్చిందని ఆరోపించింది.

తమ దేశంలోకి భారత్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రస్​ ఎదుట పాకిస్థాన్ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఐరాసలోని భారత శాశ్వత రాయబారి ఘాటు సమాధానం ఇచ్చారు.

"పాక్ చేసే ఇలాంటి అబద్ధపు ఆరోపణలను ఎవరూ నమ్మరు. తప్పుడు పత్రాలు, కథనాలు సృష్టించడం పాకిస్థాన్కేమీ కొత్త కాదు. అంతేకాదు.. ఐరాస నిషేధించిన ఉగ్రవాదులకు ఆశ్రయివ్వటం అందరికీ తెలిసిందే. అబోటాబాద్​లో గుర్తుంది కదా..!"

- టీఎస్​ తిరుమూర్తి, ఐరాసలో భారత శాశ్వత రాయబారి

అల్​ఖైధా కీలక తీవ్రవాది ఒసామా బిన్​ లాడెన్​ను 2011 మే 2న అబోటాబాద్​లోనే అమెరికా దళాలు మట్టుబెట్టాయి.

ఇదీ చూడండి: విచారణలో జాప్యం... పాక్​ జైలులో 'అఫ్రిది' నిరాహారదీక్ష

Last Updated :Nov 25, 2020, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.