ETV Bharat / international

కాన్వాస్​పై అందమైన బొమ్మలేస్తున్న శునకం

author img

By

Published : Jul 20, 2021, 10:35 AM IST

dog painting
శునకం వైరల్ వీడియో

గెంతుతూ ఫీట్లు చేసే శునకాలను చూసే ఉంటారు. కాన్వాస్​పై అందంగా బొమ్మలేసే బుజ్జి కుక్కపిల్లను ఎప్పుడైనా చూశారా? దీనిని చూశారంటే 'భలేగా ఉందే' అనక మానరు.

శునకాలు మనకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ సహాయకారిగా ఉంటాయి. ఇంట్లో చిన్న పిల్లలను చూసుకుంటాయి. ఈ ఆస్ట్రేలియన్​ షెపర్డ్​ మాత్రం ఒకడుగు ముందుకేసి పెయింట్​ బ్రష్ నోట పట్టింది. అదిరిపోయే బొమ్మ వేసి ఔరా అనిపిస్తోంది.

'సీక్రెట్​' అని పిలుచుకునే ఈ శునకం.. మేరీ అనే తన యజమానురాలికి ఇంటి పనుల్లో సహాయం కూడా చేస్తుంది. అప్పుడు అర్థం కాని గీతలు గీసే ఈ శునకం.. తొలిసారి గుర్తు పట్టగలిగేలా పువ్వు ఆకృతిని గీసిందని సంబురపడిపోతోంది మేరీ. సీక్రెట్​ గీసిన ఈ బొమ్మకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

dog painting
బొమ్మతో సీక్రెట్

ఇదీ చూడండి: అంబులెన్సు వెంట శునకం పరుగులు- వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.