ETV Bharat / international

ఆ దిగ్గజ నటుల భవంతుల్ని కొననున్న పాక్​

author img

By

Published : Jan 3, 2021, 7:12 AM IST

Updated : Jan 3, 2021, 3:04 PM IST

దిగ్గజ నటులు దిలీప్​ కుమార్​, రాజ్​కపూర్​ల భవంతుల్ని కొనుగోలు చేసేందుకు పాక్​ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెండు భవనాలకు కలిపి రూ.2.35 కోట్లు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది.

Pak's KPK govt approves Rs 2.35 cr to purchase ancestral houses of Dilip Kumar, Raj Kapoor
ఆ దిగ్గజ నటుల భవంతుల్ని కొననున్న పాక్​

బాలీవుడ్​ దిగ్గజ నటులు దిలీప్​ కుమార్​, రాజ్​కపూర్​లకు సంబంధించిన భవంతుల్ని(హవేలీ) కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్​లోని ఖైబర్​ పఖ్తూన్​ఖ్వా(కేపీ) ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన రూ. 2.35 కోట్ల నిధులను విడుదల చేయడానికి కేపీ ముఖ్యమంత్రి మెహమూద్​ ఖాన్ అంగీకరించారు.

కమ్యూనికేషన్​ అండ్​ వర్క్స్​ శాఖ మార్గదర్శకాలను అనుసరించి.. దిలీప్​ కుమార్​ నివసించిన 101 చదరపు మీటర్ల ఇంటికి రూ.80.56 లక్షలు; రాజ్​కపూర్​ నివసించిన 151.75 చదరపు మీటర్ల ఇంటికి రూ.1.50 కోట్లు గానూ పెషావర్​ డిప్యూటీ కమిషనర్​ ముహమ్మద్​ అలీ అస్ఘర్​ ధరలను నిర్ణయించారు. కొనుగోలు అనంతరం ఈ భవంతుల్ని మ్యూజియంలుగా మార్చేందుకు పురావస్తు శాఖ యోచిస్తోంది.

ఇదీ చదవండి: 'నేల కుంగిపోతోంది.. జాగ్రత్త'

Last Updated : Jan 3, 2021, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.