ETV Bharat / international

పాక్​ మాజీ ప్రధాని​పై అరెస్ట్​ వారెంట్​

author img

By

Published : Sep 18, 2020, 3:52 PM IST

Updated : Sep 18, 2020, 4:21 PM IST

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​పై అరెస్ట్​ వారెంట్​ జారీ అయింది. చికిత్స నిమిత్తం లండన్​ వెళ్లి అక్కడే తలదాచుకుంటున్నారు షరీఫ్​. ఈ తరుణంలో లండన్​లోని తమ రాయబారి కార్యాలయం​ ద్వారా అరెస్ట్​ వారెంట్​ పంపింది పాక్​ సర్కార్.

Pakisthan government sends arrest warrants for Nawaz Sharif
పాక్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​పై అరెస్ట్​ వారెంట్​

పాక్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​పై అరెస్ట్​ వారెంట్​ జారీ చేసింది ఆ దేశ ప్రభుత్వం. గుండె సంబంధిత చికిత్స కోసం లాహార్​ హైకోర్టు అనుమతితో గతేడాది నవంబర్​లో లండన్​ వెళ్లిన షరీఫ్​.. అక్కడే తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లండన్​లోని తమ రాయబార కార్యాలయం ద్వారా అరెస్ట్​ వారెంట్​ పంపింది పాక్​.

అవెన్​ఫీల్డ్​ ఆస్తుల కేసులో నవాజ్​ షరీఫ్​ సహా.. ఆయన కుమార్తె, అల్లుడు 2018 జులై 6న దోషులుగా తేలారు. దీంతోపాటు అల్​-అజిజియా కుంభకోణంలోనూ నిందితుడైన షరీఫ్​కు 2018 డిసెంబర్​లో ఏడేళ్ల జైలుశిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. అయితే.. ఈ రెండు కేసుల్లోనూ బెయిల్​ పొందిన మాజీ ప్రధాని.. చికిత్స కోసం లండన్​ వెళ్లారు. అయితే గడువులోగా స్వదేశానికి తిరిగి రానందున షరీఫ్​కు అరెస్ట్ వారెంట్ పంపింది ఇమ్రాన్​ ఖాన్ ప్రభుత్వం.

అప్పీల్​ కొట్టివేత..

ఈ కేసు విషయంలో తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని, హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ​ కోర్టును ఆశ్రయించారు షరీఫ్​. ఇటీవలే ఆ అప్పీల్​ను కొట్టేసిన ఇస్లామాబాద్​ హైకోర్ట్​.. నాన్​ బెయిలబుల్​ ఆరెస్ట్​ వారెంట్​ జారీ చేసింది.

ఇదీ చదవండి: 'ఇదే చివరి అవకాశం.. ఈనెల 10లోపు హాజరవ్వాల్సిందే'

Last Updated : Sep 18, 2020, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.