ETV Bharat / international

గిల్గిత్​ బాల్టిస్థాన్​కు రాష్ట్ర హోదా కోసం పాక్​ చట్టం!

author img

By

Published : Aug 1, 2021, 5:50 PM IST

Gilgit-Baltistan
గిల్గిత్ బాల్టిస్థాన్

వివాదాస్పద ప్రాంతం గిల్గిత్ బాల్టిస్థాన్​పై భారత్​ హెచ్చరిస్తున్నా మరో అడుగు ముందుకేసింది పాకిస్థాన్​. ఆ ప్రాంతానికి తాత్కాలిక రాష్ట్ర హోదా ఇచ్చే చట్టాన్ని ఖరారు చేసింది.

వ్యూహాత్మక ప్రాంతం గిల్గిత్​-బాల్టిస్థాన్​కు తాత్కాలిక రాష్ట్ర హోదా కల్పించే చట్టాన్ని పాకిస్థాన్​ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత చట్టం ప్రకారం ఆ ప్రాంతానికి చెందిన సుప్రీం అప్పిలేట్ కోర్టు రద్దవుతుంది. దాని ఎన్నికల కమిషన్.. పాకిస్థాన్​ ఎన్నికల సంఘంలో విలీనమవుతుంది.

పాక్ రాజ్యంగంలోని మొదటి అధికరణను సవరించడం ద్వారా గిల్గిత్​ బాల్టిస్థాన్​కు తాత్కాలిక రాష్ట్ర హోదా లభించనుంది. ఈ ప్రాంతంలో తాత్కాలిక అసెంబ్లీ సహా పాక్ పార్లమెంటులో ప్రాతినిధ్యం కల్పించేందుకు మరిన్ని సవరణలు చేయనున్నట్లు సమాచారం.

భారత్​లో అంతర్భాగం..

అయితే, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ము కశ్మీర్, లద్దాఖ్​ సహా గిల్గిత్-బాల్టిస్థాన్​లు దేశంలో అంతర్గత భాగమని భారత్​ ఇదివరకే స్పష్టం చేసింది. చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించుకున్న ప్రాంతాలపై పాకిస్థాన్​కు ఎలాంటి అధికారం ఉండదని పేర్కొంది.

ఇవీ చూడండి:

ఇమ్రాన్​ పార్టీదే గిల్గిత్​-బాల్టిస్థాన్​ పీఠం

గిల్గిత్​-బాల్టిస్థాన్​కు రాష్ట్ర హోదా ప్రకటించిన పాక్​!

చైనా పెట్టుబడుల రక్షణకే.. పాక్ పన్నాగాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.