ETV Bharat / international

చైనా పెట్టుబడుల రక్షణకే.. పాక్ పన్నాగాలు!

author img

By

Published : Oct 2, 2020, 4:27 PM IST

చైనా-పాకిస్థాన్​​ ఆర్థిక నడవా.. సీపెక్​పై చైనా భారీగా నిధులు గుమ్మరించింది. ఈ ప్రాంతంలో ఒక చిన్న మంట డ్రాగన్​ను ఆర్థికంగా దెబ్బతీయగలదు. ఈ పరిస్థితుల్లో చైనా.. తన ప్రయోజనాలను కాపాడుకోవాలని చూస్తోంది. పాక్​లో తన పెట్టుబడులకు చట్టబద్ధత కావాలంటోన్న చైనా డిమాండ్లను నెరవేర్చేందుకే యత్నిస్తోంది. అందుకే గిల్గిత్​-బాల్టిస్థాన్​లపై పాక్ కుతంత్రాలు చేస్తోందని అంటున్నారు.. ఈటీవీ భారత్​ న్యూస్ ఎడిటర్​ బిలాల్​ భట్​.

chinas-investment-in-gilgit-baltistan
'చైనా పెట్టుబడుల రక్షణకే.. పాక్ పన్నాగాలు'

గిల్గిత్​-బాల్టిస్థాన్​ సెక్టార్​ను పూర్తి స్థాయి​ ప్రావిన్స్​గా మార్చుకోవాలని చూస్తోన్న దాయాది దురాలోచన.. సరిహద్దులో వేడి రాజేస్తోంది. పాకిస్థాన్,​ గిల్గిత్​-బాల్టిస్థాన్​పై అధికారం కోసం ఎత్తులు వేయటానికి ప్రధాన కారణం.. జమ్ము-కశ్మీర్​ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ రాజ్యాంగానికి కట్టుబడి భారత్​ తీసుకున్న నిర్ణయమే.

కశ్మీర్​, గిల్గిత్​-బాల్టిస్థాన్​ వ్యవహారాలు పర్యవేక్షించే పాకిస్థాన్​ మంత్రి అలీ అమిన్​ గందాపూర్.. ఈ ప్రాంతాన్ని పాక్​లో ఐదో ప్రావిన్సుగా చేసుకుని.. కశ్మీర్​పై భౌగోళికంగా నియంత్రణ సాధించే స్థాయిలో ఉంటామని తెలిపారు. పాక్ వ్యాఖ్యల ప్రకారం గిల్గిత్​-బాల్టిస్థాన్​ల నుంచి జాతీయ అసెంబ్లీకి ప్రజాప్రతినిధులు ఉండనున్నారు. పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో ఇలాంటి పరిస్థితులు మరెక్కడా లేవు. ఇప్పటివరకూ ఈ ప్రాంతం ప్రత్యేకమైనదని, జమ్ముకశ్మీర్​లో భాగం కాదని, ప్రత్యేక చరిత్ర ఉందంటున్న వాదనలు ఖండించేందుకే దాయాది ఈ తరహా చర్యలకు ఉపక్రమించింది. వాస్తవానికి నాడు గులాబ్​ సింగ్​- బ్రిటీషర్లతో కుదుర్చుకున్న అమృత్​సర్​ ఒప్పందంలో గిల్గిత్​-బాల్టిస్థాన్​ భాగంగా లేదు. తర్వాతే జమ్ము-కశ్మీర్​లో కలిసింది.

నాటి గిల్గిత్​ ఏజెన్సీ, ఉత్తర ప్రాంతాలను.. ప్రత్యేక ప్రతినిధి ద్వారా బ్రిటిషర్లే పాలించేవారు. పక్కదేశాల్లో ఉన్న కమ్యూనిజం ఈ ప్రాంతంలోకి వ్యాపించకుండా ప్రయత్నించేవారు. అయితే, అప్పటి పాలకులు ఈ ప్రాంతాన్ని కశ్మీర్​లో కలిపేయటం వల్ల అన్యాయం జరిగిందని ఆరోపించేవారు. ఈ ప్రాంతం ఎప్పుడూ కూడా పీఓకేలోని ఇతర ప్రాంతాలలాగా లేదు.

chinas-investment
సీపెక్​పై భారీగా నిధులు గుమ్మరించిన చైనా

పాక్​ ఆక్రమిత కశ్మీర్​కు ప్రత్యేక ఆధ్యక్షుడు, ప్రధాని, శాసనసభ ఉంటాయి. గిల్గిత్​ బాల్టిస్థాన్​లో ఇటువంటి పరిస్థితులు లేవు. ప్రత్యక్షంగా పాక్​ ప్రభుత్వమే చట్టసభ ద్వారా కార్యకలాపాలు చూసుకుంటుంది. 2018 నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

పీఓకే సుప్రీం కోర్టు పరిధిలోనూ గిల్గిత్​-బాల్టిస్థాన్ లేదు. అయితే, పాకిస్థాన్ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు, పాకిస్థాన్​-చైనా ఒప్పందం, జమ్ము-కశ్మీర్ ఒప్పందాలు ఈ ప్రాంతంలో అమలవుతాయి. కానీ, ఇప్పుడు ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్​లో ప్రావిన్సుగా మార్చితే దీని రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోనుంది.

యూరోపియన్​ ఫౌండేషన్​ ఆఫ్​ సౌత్​ ఏషియా స్టడీస్​.. ఈఎఫ్​ఎస్​ఏఎస్​, మరికొంత మంది ఐరోపా మేధావులు.. ఈ నిర్ణయం రావల్పిండిలో తీసుకుందని, ఇస్లామాబాద్​లో కాదని చెబుతున్నారు. రావల్పిండి దేశ సైన్యానికి రాజధానిగా ఉంది.

ఈ నేపథ్యంలోనే తన ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకునేందురు.. చైనానే పాక్​ను ఈ మేరకు ఉసిగొల్పుతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సీపెక్​ను చైనా ప్రధాన వాణిజ్య మార్గంగా భావిస్తోంది. ఇది గిల్గిత్​-బాల్టిస్థాన్​ గుండానే వెళ్తోంది. ఇది పాత జమ్ము-కశ్మీర్​లో భాగం. భారత మొదటి ప్రధాని పండిత్ జవహర్​ లాల్​ నెహ్రూ సైతం వివాదాస్పద ప్రాంతంలో గిల్గిత్​ ఏజెన్సీ భాగమని ఐరాసలో నాడు వెల్లడించారు.

ఒక్కసారి ఈ ప్రాంతం, పాక్​లో భాగంగా మారితే ఇక్కడ భూమి, ఇతర వనరులపై పాక్ అనాలోచితంగా వ్యవహరిస్తుంది. ఈ ప్రాంతంలో చైనా సహా.. ఏ దేశమైనా అర్థిక కార్యకలాపాలు సాగించుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా చైనా సీపెక్​ ప్రాజెక్టుపై భారీగా నిధులు గుమ్మరించిన నేపథ్యంలో.. ఉద్రక్తతలు డ్రాగన్​ ఆశలపై నీల్లుజల్లుతాయి. ఈ నేపథ్యంలో చైనా... ఈ ప్రాంతంపై చట్టబద్ధత పొందాలని పాక్​పై ఒత్తిడి తెస్తోంది.

Gilgit Baltistan
చైనా-పాకిస్థాన్​​ ఆర్థిక నడవా ప్రయోజనాలకే

సరహద్దులో.. ముఖ్యంగా లద్దాఖ్​లో వాస్తవాధీన రేఖ వెంట చైనా కయ్యానికి కాలు దువ్వటానికి ప్రధాన కారణంగా.. కశ్మీర్​ స్వయం ప్రతిపత్తి తొలగింపే కనిపిస్తోంది. ఎందుకంటే ఆగస్టు-5కు ముందున్న పరిస్థితులు డ్రాగన్​ కుయుక్తులకు అడ్డురాకపోయేవి. ఈ నేపథ్యంలోనే ప్రతీకారంగా గిల్గిత్​-బాల్టిస్థాన్​ ప్రాంతంలో పాక్​తో కలిసి కుతంత్రాలు చేస్తోంది.

అలాగే, గిల్గిత్​-బాల్టిస్థాన్​లో మార్పులకు వ్యతిరేకంగా భారత్​ గళమెత్తిన తర్వాత సరిహద్దులో చైనా దూకుడు మరింత పెంచింది. మరోవైపు బలూచిస్థాన్ వేర్పాటువాదులకు భారత్​ మద్దతు తెలపటంపై.. పాకిస్థాన్​ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎల్​ఏసీ, ఎల్​ఓసీల వద్ద పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి.

ఒకవేళ పాక్​ గనుక.. ఇదే నిర్ణయంతో ముందుకెళ్తే, కొద్దిమంది హురియత్ నేతల మద్దతు తప్ప పెద్దగా కోల్పోయేది ఏం లేదు. హురియత్ నేతలు కశ్మీర్​ అంశం పూర్తిగా పరిష్కారమయ్యేవరకూ ఈ ప్రాంత ప్రస్తుత స్థితి మార్చొద్దంటున్నారు. హురియత్​ కాన్ఫరెన్స్​ నేత అబ్దుల్లా గిలానీ, పాక్​ నిర్ణయం పట్ల ఆ దేశ మాజీ సైనికాధిపతి అష్ఫాఖ్​ ఖ్యానీ వద్ద వ్యతిరేక గళం విప్పారు.

మొత్తంగా, ఈ నిర్ణయం వల్ల గిల్గిత్​-బాల్టిస్థాన్​ ప్రాంతంలో చైనా ప్రాజెక్టులకు అడ్డంకులేం ఉండవని.. అందువల్ల ఒత్తడి తగ్గుతుందని పాక్​ భావిస్తోంది. అయితే, గిల్గిత్​-బాల్టిస్థాన్​ అంతర్జాతీయ సమాజం గుర్తించిన వివాదాస్పద ప్రాంతం. ఇప్పుడది పాక్​లో భాగమైనా.. కాకపోయినా.. సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేవరకూ ప్రస్తుతం ఉన్నట్లుగానే ఉంటుంది.

- బిలాల్ భట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.