ETV Bharat / international

ఆ దేశాలతో పాక్ భేటీ- అఫ్గాన్​ గురించి కీలక చర్చ

author img

By

Published : Sep 6, 2021, 10:08 AM IST

అమెరికా దళాల నిష్క్రమణ అనంతరం అఫ్గానిస్థాన్​లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. తాజా పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాకిస్థాన్ పావులు కదుపుతోంది. ఈ మేరకు అఫ్గాన్​ పొరుగు దేశాలతో వర్చువల్​గా ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో చైనాతో పాటు.. ఇరాన్‌ దేశాల ప్రత్యేక ప్రతినిధులు, రాయబారుల పాల్గొన్నారు. మరోవైపు అఫ్గాన్​ మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మద్దతిస్తామని ఐరాస ప్రకటించింది.

taliban
taliban

అఫ్గానిస్థాన్ పొరుగు దేశాల ప్రతినిధులతో పాకిస్థాన్ ఉమ్మడి సమావేశం నిర్వహించింది. అఫ్గాన్​లో తాజా పరిస్థితిపై చర్చించినట్లు ప్రకటించింది. అప్గాన్​లో పాకిస్థాన్ ప్రత్యేక ప్రతినిధి మొహమ్మద్ సాదిక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తాజా పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. చైనా, ఇరాన్, తజకిస్థాన్, తుర్క్​మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి గత నెలలో ఇరాన్, తుర్క్​మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్​లలో పర్యటించిన కొన్ని రోజులకే ఈ సమావేశం జరగడం గమనార్హం.

సుదీర్ఘ యుద్ధంతో దెబ్బతిన్న అఫ్గాన్​లో శాంతిభద్రతలతో పాటు స్థిరత్వం కీలకమని చైనా, ఇరాన్, తజకిస్థాన్, తుర్క్​మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సవాళ్ల పరిష్కారం కోసం కృషితో పాటు.. ప్రాంతీయ విధాన ఆవశ్యకతను ఉద్ఘాటించారు.

ఐరాసతో తాలిబన్ల సమావేశం..!

దేశంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంలో ప్రజలకు మానవతా కోణంలో సహాయం చేయాల్సిందిగా తాలిబన్లు ఐరాసను కోరారు. ఈ మేరకు తాలిబన్‌ ప్రభుత్వంలో(afghan taliban) కీలక స్థానాన్ని దక్కించుకోనున్న ముల్లా బరాదర్‌ ఐరాస మానవతా వ్యవహారాల బాధ్యుడు మార్టిన్ గ్రిఫిత్స్‌తో సమావేశమయ్యారు. కాబుల్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో అఫ్గాన్​కు ఐరాస మద్దతు, సహకారం కొనసాగుతాయని ఐరాస హామీ ఇచ్చినట్లు టోలో న్యూస్ వెల్లడించింది. ఈ సమావేశం తాలూకు ఫొటోలను తాలిబన్ ప్రతినిధి మొహమ్మద్ నయీమ్ ట్వీట్ చేశారు.

taliban
ఐరాస మానవతా వ్యవహారాల సెక్రటరీ జనరల్ మార్టిన్ గ్రిఫిత్స్​తో తాలిబన్లు
taliban
ఐరాస మానవతా వ్యవహారాల సెక్రటరీ జనరల్ మార్టిన్ గ్రిఫిత్స్​తో తాలిబన్ల సమావేశం

"సంక్షోభం సమయంలో లక్షలాది మందికి నిష్పాక్షిక మానవతా సహాయం, రక్షణను అందించేందుకు ఐరాస నిబద్ధతను కలిగి ఉందని చాటేందుకు తాలిబాన్ నాయకత్వాన్ని కలిశాను" అని మార్టిన్ గ్రిఫిత్స్ ట్వీట్ చేశారు.

మరో సంక్షోభం తప్పదా?..

మరోవైపు అఫ్గానిస్థాన్‌లో అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికా అనుమానిస్తోంది. అక్కడి పరిస్థితులు చూస్తుంటే ఉగ్రమూకలు మళ్లీ చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయని అమెరికా జాయింట్ చీఫ్‌ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ మార్క్‌ మిల్లే ఆందోళన వ్యక్తంచేశారు. అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణతో తాలిబన్ల ఆక్రమణ మొదలైందని, అయితే పంజ్​షేర్‌ ప్రాంతాన్ని ఆక్రమించలేకపోయారని మార్క్‌ మిల్లే పేర్కొన్నారు. అఫ్గాన్‌లోని పరిస్థితులు అంతర్యుద్ధానికి దారితీసేలా ఉన్నాయని హెచ్చరించారు. అల్-ఖైదా, ఐసిస్‌ లాంటి ఉగ్రవాద సంస్థలకు పునర్జీవనం ఇచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. అంతేకాకుండా అఫ్గాన్‌లోని భయానక పరిస్థితులు చూస్తుంటే అక్కడ ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నట్లు చెప్పుకొచ్చారు.

'ఊహించలేదు.. నిఘా వైఫల్యం కాదు..'

అమెరికా దళాల నిష్క్రమణ అనంతరం కాబుల్​ను ఈ ఏడాది చివరిలోగా తాలిబన్లు స్వాధీనం చేసుకోవచ్చని బ్రిటన్ నిఘా వర్గాలు అంచనా వేశాయని.. అయితే దీనికి భిన్నంగా పరిణామాలు జరిగాయని నిక్ కార్టర్ బ్రిటన్ ఆర్మీ చీఫ్ తెలిపారు.

"తాలిబన్ల వేగం మాకు ఆశ్చర్యం కలిగించింది. వారు ఏం చేస్తున్నారో మేం గ్రహించలేదు. తాలిబన్లు కూడా తాము అనుకున్నంత త్వరగా పరిస్థితులు మారతాయని ఊహించలేదు. ఇది కచ్చితంగా నిఘా వర్గాల వైఫల్యం కాదని చెప్పగలను".

-నిక్ కార్టర్, బ్రిటన్ ఆర్మీ చీఫ్ జనరల్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.