ETV Bharat / entertainment

'నరేశ్ 62' ఇంట్రెస్టింగ్ లుక్ - ఊరమాస్ 'బచ్చల మల్లి' ఎంట్రీ - Bachhala Malli Movie First Look

author img

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 3:45 PM IST

Allari Naresh Bachhala Malli Movie : కామెడీ సినిమాలతో ఎంటర్​టైన్ చేసే స్టార్ హీరో అల్లరి నరేశ్ ఇప్పుడు మాస్ రోల్​లో కనిపించనున్నారు. 'బచ్చల మల్లి' అనే సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగా మేకర్స్ తాజాగా ఓ స్పెషల్ పోస్టర్​ను విడుదల చేశారు. దాన్ని మీరూ ఓ లుక్కేయండి.

Allari Naresh  Bachhala Malli Movie
Allari Naresh Bachhala Malli Movie (Source : ETV Bharat Archives)

Allari Naresh Bachhala Malli Movie : కామెడీ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేశ్​, ఆ తర్వాత సీరియస్ రోల్స్​లోనూ నటించి అభిమానులను మెప్పించారు. పాత్ర ఏదైనా సరే అందులో లీనమైపోయి నటిస్తూ అలరింతే ఈ స్టార్ హీరో ఇప్పుడు ఫుల్​ ఆన్​ మాస్ రోల్‌తో ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయిపోయారు. 'బచ్చల మల్లీ' అనే సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ హీరో ఫస్ట్ లుక్​కు సంబంధించిన స్పెషల్ పోస్టర్​ను రిలీజ్ చేశారు.

పేరు: మళ్ళీ, ఇంటిపేరు : బచ్చల, చేసేది : ట్రాక్టర్ డ్రైవెర్. "ఈ బచ్చల మల్లి ఖచ్చితంగా మీకు చాలా రోజులు గుర్తుండిపోతారు". అంటూ హీరో ఇంట్రడక్షన్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో నరేశ్ ఒక లోకల్ రౌడీ పాత్ర పోషించనున్నారు. అందుకోసమే ఈ కథకు తగ్గట్టుగా నరేశ్ గడ్డం పెంచుకుని, మెడలో తాయెత్తు, చేతికి కాశీ దారం ఇలా ఫుల్​ మాస్ లుక్​లో కనిపించారు. అంతేకాకుండా ఓ రిక్షా మీద కూర్చొని బీడీ తాగుతున్నట్లు కూడా ఆ పోస్టర్​లో చూడొచ్చు. ఇలా పలు మాస్ ఎలిమెంట్స్​తో ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం మూవీ లవర్స్​ను తెగ ఆకట్టుకుంటోంది.

ఇక ఈ మూవీ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్‌లోని తుని ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సుబ్బు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆయనే దీనికి రైటర్ కూడా. హాస్య మూవీస్ బ్యానర్​ పై రాజేశ్ దండ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

అల్లరి నరేశ్ సరసన హీరోయిన్‌గా అమృత అయ్యర్ కనిపిస్తుండగా, ఇతర సహ నటుల పాత్రల్లో రోహిణీ, రావు రమేశ్, అచ్చుత్ కుమార్, బలగం జయరాం, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష కనిపిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఫుల్ మాస్ స్టోరీతో అలరించేందుకు రెడీ అవుతోన్న ఈ ప్రాజెక్టు మరి కొద్ది నెలల్లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం హైదరాబాద్​లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

పెళ్లి కోసం అల్లరి నరేశ్​ తిప్పలు - 'ఆ ఒక్కటీ అడక్కు' ఎలా ఉందంటే? - Aa Okkati Adakku Movie Review

'ఆ సినిమాతో నా రేంజ్‌ పెరిగిపోతుందనుకున్నా.. కానీ..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.