ETV Bharat / international

'భారత్​తో అణుయుద్ధమే.. మా వాళ్లను కాపాడుకుంటాం​'

author img

By

Published : Aug 21, 2020, 3:51 PM IST

దాయాది పాకిస్థాన్​.. మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది. పాక్​ మంత్రి షేక్​ రషీద్​.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్​తో తలపడాల్సి వస్తే అది సంప్రదాయ యుద్ధం కాదని, అణుయుద్ధం తప్పదని హెచ్చరించారు. అయితే.. తమ ఆయుధాలు ముస్లింలను కాపాడతాయని, కొన్ని ప్రాంతాలను మాత్రమే లక్ష్యం చేసుకుంటాయని వ్యాఖ్యానించారు. దీనిపై భారత్​ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Pak threatens India with nuclear war which won't harm Muslims
భారత్​తో అణుయుద్ధమే

పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అణుయుద్ధం పేరిట భారత్​ను బెదిరించే ప్రయత్నంలోని తన పాత పాటను అందుకుంది. ఆ దేశ ఫెడరల్​ మంత్రి షేక్​ రషీద్​.. భారత్​తో తలపడాల్సి వస్తే అణుయుద్ధం తప్పదని హెచ్చరించే ప్రయత్నం చేశారు. అయితే.. తమ వద్ద ఉన్న ఆయుధాలు ముస్లింలను రక్షిస్తాయని.. కొన్ని ప్రాంత్రాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాయని పేర్కొనటం గమనార్హం. అసోం కూడా.. తమ లక్షిత జాబితాలో ఉందని వెల్లడించారు.

ఓ టీవీ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు రషీద్​.

" పాకిస్థాన్​పై భారత్​ దాడి చేస్తే.. సంప్రదాయ యుద్ధానికి అవకాశం లేదు. భయంకరమైన అణు యుద్ధమే జరుగుతుంది. మా వద్ద చిన్న, కచ్చితమైన, శక్తిమంతమైన ఆయుధాలు ఉన్నాయి. విస్పష్టంగా లక్ష్యాలను ఛేదించగలవు. మా ఆయుధాలు ముస్లింలను రక్షించి.. కొన్ని ప్రాంతాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాయి. అసోం కూడా ఇందులో ఉంది. సంప్రదాయ యుద్ధం చేసే ఆలోచన పాక్​కు లేదు. అందువల్ల ఏదైనా జరిగితే అది ముగింపేనని భారత్​కు తెలుసు."

- షేక్​ రషీద్​, పాక్​ మంత్రి.

మొదటిసారి కాదు..

అణుయుద్ధం పేరిట భారత్​ను బెదిరించే ప్రయత్నం చేయటం పాక్​కు ఇదేం మొదటిసారి కాదు. 2019లో పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ పలు సందర్భాల్లో అణుయుద్ధం గురించి మాట్లాడారు. అదే ఏడాది.. తమ దేశంలో 125-250 గ్రాముల అణుబాంబులు ఉన్నాయని రషీద్​ అన్నారు.

మరి పాక్​ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత్​ స్పందిస్తుందో లేదో చూడాలి.

ఇదీ చూడండి: 'ప్రతిపక్ష నేతపై విషప్రయోగం-భగ్గుమన్న నిరసనలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.