ETV Bharat / international

సయీద్​ సహా లష్కర్ నేతలను విచారించాల్సిందే: అమెరికా

author img

By

Published : Oct 14, 2019, 11:28 AM IST

సయీద్​ సహా లష్కర్ నేతలను విచారించాల్సిందే: అమెరికా

హఫీజ్ సయీద్ సహా లష్కరే తొయిబా, జమాత్​ ఉద్ దవా ఉగ్రసంస్థల నేతలను పాకిస్థాన్ విచారించాల్సిందేనని తేల్చింది అగ్రరాజ్యం అమెరికా. అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ(ఎఫ్​ఏటీఎఫ్) నూతన జాబితా విడుదలకు ముందు ఈ సూచనలు చేసింది అమెరికా. పాకిస్థాన్​ తమ భూభాగంలో ఉగ్రవాదాన్ని నియంత్రించాలని నిర్దేశించింది.

అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ నూతన నివేదిక వెలువడేందుకు ముందు పాకిస్థాన్​కు షాకిచ్చింది అగ్రరాజ్యం అమెరికా. లష్కరే తొయిబా అగ్రనేత హఫీజ్ సయీద్ సహా ఆ ఉగ్రసంస్థ సభ్యులపై విచారణ జరపాలని దాయాదికి సూచించింది. అమెరికా దక్షిణ, మధ్య ఆసియా విభాగం అధ్యక్షుడు అలీస్ వెల్స్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. లష్కరే తొయిబా, జమాత్​ ఉద్​ దవాకు చెందిన నలుగురు అగ్రనేతల అరెస్టును స్వాగతించారు.

"పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ ప్రకటించిన విధంగా ఆ దేశ భవిష్యత్​ కోసం వారి భూభాగంపై ఉగ్రవాదాన్ని నియంత్రించాల్సిందే. నలుగురు ఉగ్రవాదుల అరెస్టును స్వాగతిస్తున్నాం. లష్కరే చేసిన దాడుల బాధితులకు న్యాయం కోసం హఫీజ్​ సయీద్​ సహా అతడి అనుచరుల్ని విచారించాలి."

-అలీస్ వెల్స్ ట్వీట్

లష్కరే, జేయూడీకి చెందిన నలుగురు ఉగ్రవాదులు జాఫర్ ఇక్బాల్, యాహ్యా అజీజ్, మహ్మద్ అష్రఫ్, అబ్దుల్ సలామ్​లను పాక్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. కానీ ఉగ్రవాదులను అరెస్టు చేయడం, తిరిగి విడుదల చేయడం పాక్​లో సాధారణమైపోయింది.

గతేడాది జూన్​​లో పాక్​ను గ్రే లిస్ట్​లో చేర్చింది అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ. 2019 అక్టోబర్​ నాటికి తమ సూచనలు పాటించాలని నిర్దేశించింది. ఈ నెల 12 నుంచి 15 వరకు పాక్ సహా పలు దేశాల పురోగతిపై సమీక్ష చేస్తుంది ఎఫ్​ఏటీఎఫ్. పాక్​ను గ్రే లిస్టులోనే కొనసాగిస్తుందా లేక బ్లాక్​ లిస్ట్​లో చేరుస్తుందా అనే అంశం తెలిసేందుకు మరికొంత సమయం పట్టనుంది.

ఇదీ చూడండి: ఎవరెస్ట్ శిఖరం ఎత్తు తగ్గిందా? త్వరలో ప్రకటన!

Chamoli (Uttarakhand), Oct 14 (ANI): At least eight people were killed and five others got injured after a vehicle fell into the Kail River in Dewal region of Uttarakhand's Chamoli. According to a State Disaster Response Force (SDRF) official, one person is still missing as rescue operation is underway.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.