ETV Bharat / international

పాకిస్థాన్​​ ప్రతిపక్షనేతపై దేశద్రోహం కేసు!

author img

By

Published : Nov 2, 2020, 9:26 AM IST

పాకిస్థాన్​ ప్రతిపక్ష నేత అయాజ్​ సాదిఖ్​పై దేశద్రోహం కేసు నమోదు చేయాలనే యోచనలో ఉంది ఆ దేశ ప్రభుత్వం. భారత వైమానిక​ వింగ్​ కమాండర్​ విషయంలో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల.. అయాజ్​పై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ ఆలోచన చేస్తోంది ఇమ్రాన్ ఖాన్​ ప్రభుత్వం.

Pak considers registering treason case against PML-N leader over remarks on release of Abhinandan
పాకిస్థాన్​​ ప్రతిపక్షనేతపై దేశద్రోహం కేసు!

వింగ్​ కమాండర్ అభినందన్​ అప్పగింతకు ముందు భారత్​ ఎక్కడ దాడి చేస్తోందో అనే భయంతో పాకిస్థాన్ వణికిపోయిందన్న ఆ దేశ ప్రతిపక్షనేత అయాజ్​ సాదిఖ్​పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని యోచిస్తోంది అక్కడి​ ప్రభుత్వం. అయాజ్​పై భారీ సంఖ్యలో ఫిర్యాదులు రావడం వల్ల ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎజాజ్​ షా తెలిపారు.

2019 ఫిబ్రవరిలో జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటూ.."ఆ రోజు జరిగిన సమావేశం నాకు బాగా గుర్తుంది. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి.. పార్లమెంటరీ నేతలతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి ఇమ్రాన్​ ఖాన్​ హాజరు కాలేదు. అభినందన్​ను గనుక విడిచి పెట్టకపోతే.. రాత్రి 9 గంటలకల్లా పాకిస్థాన్​పై భారత్​ దాడి చేస్తుందని ఖురేషీ హెచ్చరించారు. ఆ సమయంలో ఆర్మీ ఛీఫ్​ బజ్వా కాళ్లు వణకడం నేను గమనించాను." అని వ్యాఖ్యలు చేశారు అయాజ్​.

ఇవీ చూడండి: 'భారత్ దాడి చేస్తుందని పాక్ ఆర్మీ చీఫ్ వణికిపోయారు'

'అభినందన్​ విషయంలో రహస్యాలన్నీ నాకు తెలుసు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.