ETV Bharat / international

'మయన్మార్ నిరసనల్లో 320 మంది మృతి'

author img

By

Published : Mar 26, 2021, 3:37 PM IST

మయన్మార్​ ఆందోళనల్లో ఇప్పటివరకు 300 మందికిపైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. వీరిలో 90 శాతం మంది తుపాకీ తూటాలకు బలైనట్లు పేర్కొంది.

Myanmar protest deaths top 300 as US, UK, impose sanctions
'మయన్మార్ ఆందోళనల్లో 300 మందికి పైగా పౌరుల హతం'

మయన్మార్‌లో ఆందోళనలకారులపై సైన్యం అణచివేత ధోరణి కొనసాగుతోంది. సైన్యం కాల్పుల్లో ఇప్పటివరకు 300 మందికిపైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి న్యాయవాదులు, మీడియా విడుదల చేసిన డేటాలో తేలింది. వారిలో తుపాకీతో కాల్చడం వల్లే 90 శాతం మంది చనిపోయారని వివరించింది. మృతుల్లో 36శాతం మంది 24 ఏళ్లలోపు వయస్సు వారేనని పేర్కొంది.

మార్చి 25 నాటికి 320 మంది చనిపోయారని ఏఏపీపీ గ్రూప్ వెల్లడించింది. 3 వేల మందిని సైనిక ప్రభుత్వం అరెస్టు చేసిందని పేర్కొంది. అయితే.. ఆందోళనల్లో 164 మంది నిరసనకారులు, 9 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లు సైనిక ప్రభుత్వం తరఫు ప్రతినిధి చెప్పారు.

మయన్మార్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సైన్యం.. పాలనను తమ చేతుల్లోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నారు.

ఇదీ చూడండి: మయన్మార్​ నిరసనల్లో 138 మంది మృతి: ఐరాస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.