ETV Bharat / international

పాకిస్థాన్​లో మరో భారీ ర్యాలీ- జనసంద్రంలా కరాచీ

author img

By

Published : Oct 18, 2020, 10:20 PM IST

పాకిస్థాన్​లో ఇమ్రాన్ సర్కార్​కు వ్యతిరేకంగా ఏర్పాటైన ప్రతిపక్షాల కూటమి మరో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ నిరసన ప్రదర్శనలో ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. కరాచీలో జరిగిన ర్యాలీకి ప్రజలు భారీగా తరలివచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ఓట్లను ఇమ్రాన్ తస్కరించారని పీఎంఎల్-ఎన్ పార్టీ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ ఆరోపించారు.

Maryam Nawaz, Bilawal Bhutto, among opposition leaders at Karachi's Bagh-e-Jinnah ground for second PDM 'jalsa'
పాకిస్థాన్​లో మరో భారీ ర్యాలీ- జనసంద్రంలా కరాచీ

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటైన పాకిస్థాన్ ప్రజాస్వామ్య ఉద్యమ(పీడీఎం) కూటమి భారీ బలప్రదర్శన నిర్వహించింది. ఈ ర్యాలీలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ర్యాలీ జరిగిన కరాచీలోని బాగ్​-ఈ-జిన్నా ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. పార్టీ జెండాలు పట్టుకొని, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు ప్రజలు.

బిలావల్ భుట్టో జర్దారీ, మరియం నవాజ్, మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్, మెహమూద్ ఖాన్, మోహ్సిన్ దవార్​ సహా పలువురు విపక్ష నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

Maryam Nawaz, Bilawal Bhutto, among opposition leaders at Karachi's Bagh-e-Jinnah ground for second PDM 'jalsa'
కరాచీలో జన సందోహం

మా లక్ష్యం అదే: మరియం

2018 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ఓట్లను దొంగలించారని అధికార పార్టీ లక్ష్యంగా ఆరోపణలు చేశారు ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్. ఓట్ల పవిత్రతను పునరుద్ధరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Maryam Nawaz, Bilawal Bhutto, among opposition leaders at Karachi's Bagh-e-Jinnah ground for second PDM 'jalsa'
ప్రజలకు అభివాదం

"ప్రజలు ఇప్పుడు మనకంటే ముందున్నారు. ప్రజలకు ప్రాతినిథ్యం వహించడంలో మేము(ప్రతిపక్షాలు) కాస్త ఆలస్యం చేశాం. కానీ ఇప్పుడు పీడీఎం వేదికగా కలిశాం."

-మరియం నవాజ్, పీఎంఎల్-ఎన్ ఉపాధ్యక్షురాలు.

అంతకుముందు పాకిస్థాన్​కు చేరుకున్న మరియం నవాజ్​కు పార్టీ కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు. తనకు లభించిన స్వాగతం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

Maryam Nawaz, Bilawal Bhutto, among opposition leaders at Karachi's Bagh-e-Jinnah ground for second PDM 'jalsa'
భారీగా తరలివచ్చిన జనం

ఈ ర్యాలీకి పోలీసులు భారీ భద్రత కల్పించారు. మొత్తం 3,740 మంది అధికారులను మోహరించినట్లు తెలిపారు. 30 మంది సీనియర్ అధికారులు, 65 మంది డీఎస్పీలను రంగంలోకి దించినట్లు చెప్పారు.

Maryam Nawaz, Bilawal Bhutto, among opposition leaders at Karachi's Bagh-e-Jinnah ground for second PDM 'jalsa'
కార్యకర్తల బైక్ ర్యాలీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నెలలో 11 ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, జమియత్ ఉలెమా-ఇ-ఇస్లాం-ఫజల్​ల కూటమిలో ప్రధానంగా ఉన్నాయి.

ఇదీ చదవండి- ఇమ్రాన్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల భారీ ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.